టైమ్ చూసి టైమ్ బాంబ్ లా ఏదో ఒక కొత్తదనం ఉన్న సినిమాతో అభిమానుల ముందుకు రావడం గూఢచారి హీరో శేష్ ప్రత్యేకత. ఇంతకుముందు గూఢచారి అలాంటి సినిమానే. ఉన్నట్టుండి పరిమిత బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించి అందులో హీరోగా నటించిన అతడికి మంచి పేరొచ్చింది. రచయితగా గైడ్ గా ఆ సినిమా కోసం శేష్ చేసిన హార్డ్ వర్క్ కి గుర్తింపు దక్కింది.
ఇకపోతే ప్రస్తుతం స్వీయ నిర్భంధంలో ఉన్న ఈ యంగ్ హీరో ఏం చేస్తున్నాడు? అంటే .. తనకు దొరికిన పాత డీవీడీలు అన్నిటినీ తిరగేస్తున్నాడట. ఇక యూట్యూబ్ – స్ట్రీమింగ్ వెబ్ సైట్లలోకి వెళ్లి పాత సినిమాల్లో క్లాసిక్స్ ని చూస్తున్నాడట. హాలీవుడ్ సెన్సేషనల్ హిట్ సిరీస్ గాడ్ ఫాదర్ లో అన్ని సినిమాలు చూసేస్తున్నాడట. అలాగే మణిరత్నం తెరకెక్కించిన దళపతి, రోజా, బొంబాయి లాంటి సినిమాల్ని చూసేస్తున్నాడు. అయితే వీటిని చూడాలనుకోవడానికి కారణమేమిటి? అంటే దానికి రకరకాల రీజన్స్ వినిపిస్తున్నాయి. శేష్ ప్రస్తుతం గూఢచారి సీక్వెల్ కథ కోసం కసరత్తు చేస్తున్నాడు. పైగా మేజర్ ఉన్నికృష్ణన్ బయోపిక్ లోనూ నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మహేష్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండిటికి అవసరమైన సరంజామా కోసం వెతుకుతున్నాడా? ఏదైనా స్ఫూర్తి నింపే టెక్నిక్ ని లాజిక్ ని పట్టే పనిలో ఉన్నాడా? అసలు ఈ రీసెర్చ్ దేనికి అంటూ రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అంతా బాగానే ఉంది కానీ.. ఇలా క్లాసిక్స్ చూడడం వల్ల ఉపయోగం ఉందంటారా? ప్రస్తుతం ఏ నోట విన్నా కరోనా కరోనా.. ఈ వైరస్… దిగ్భంధనం నేపథ్యంలోనే దాదాపు 20 పైగా హాలీవుడ్ సినిమాలొచ్చాయి. కంటాజియాన్ లాంటి సినిమాని కేవలం కరోనా వైరస్ దిగ్భంధనం నేపథ్యంలో తెరకెక్కించారు. ప్రస్తుత ట్రెండ్ కి తగ్గట్టు కరోనా(కొవిడ్ 19) బేస్ చేసుకుని ఏదైనా కొత్త కథ రాసుకుంటే బెటర్ కదా? అని పలువురు అభిమానులు కోరుతున్నారు. మరి శేష్ వింటున్నాడా?
