అడవి శేషు ‘ఎవరు’ టాక్…కథ
క్షణం, గూఢచారి సినిమాలతో తన కంటూ మార్కెట్ క్రియేట్ చేసుకున్న అడివి శేష్ మరోసారి తనదైన విభిన్న శైలిలో ఓ డిఫరెంట్ సినిమాతో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పీవీపీ నిర్మాణంలో వెంకట్ రామ్‌జీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఎవరు సినిమాకు నిన్న రాత్రే హైదరాబాద్ ప్రసాద్స్ లో ప్రీమియర్ వేసారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఎలా ఉంది…మళ్లీ అడవి శేషు హిట్ కొట్టాడా…కథేంటి వంటి విషయాలు చూద్దాం.
ఒక మర్డర్ కేసు, ఓ మిస్సింగ్ కేసుతో నడిచే ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ని స్క్రీన్ ప్లే నిలబెట్టింది. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ తరహాలో ఎక్కడా కనురెప్ప రెప్పవేయకుండా చూసేంత ఇంట్రస్టింగ్‌గా మలిచారు. అలాగే ఎక్కడైనా కథ డ్రాప్ అవుతోందనుకునే టైమ్లో ఓ ట్విస్ట్ వచ్చి మళ్లీ ట్రాక్ లో పెట్టేస్తుంది. ఇక దర్శకుడు వెంకట్ రామ్‌జీ కమర్షిల్ ఎలిమెంట్స్, నేటవిటి అంటూ ప్రక్క దారులు పట్టకుండా… థ్రిల్లర్ జానర్‌కే ఫిక్స్ అయి సినిమాను నడిపించాడు.
అయితే రొటీన్ ఫార్ములా సినిమాలను ఇష్టపడేవారిని ఈ సినిమా అలరించటం కాస్త కష్టమే అని చెప్తున్నారు. అలాగే ఈ సినిమా Invisible Guest (2016) అనే స్పానిష్ చిత్రానికి రీమేక్ గా వచ్చింది. కాబట్టి ఆ సినిమాను చూసిన వారు కానీ, లేదా ఆ సినిమాకు హిందీ రీమేక్ గా వచ్చిన బద్లా చూసిన వారికి తప్ప మిగతా వాళ్లకు నచ్చే అవకాసం ఉంటుంది. ట్విస్ట్ లను ఎంజాయ్ చేయగలగుతారు. అయితే ఇలాంటి ట్విస్ట్ బేసెడ్ కథలకు రిపీట్ ఆడియన్స్ ఉండరు.
ఇక కథ విషయానికి వస్తే..
బిజినెస్ మ్యాన్ రాహుల్ భార్య సమీరా(రెజీనా), డీసీపీ అశోక్ (నవీన్ చంద్ర)ను కాల్చి చంపేయటంతో సినిమా మొదలవుతుంది. పోలీస్ డిపార్టమెంట్ కు చెందిన వ్యక్తి అవటంతో కేసు తీవ్రంగా ఉంటుంది. సమీరా మాత్రం అశోక్ తనను రేప్ చేయటంతో ఆత్మరక్షణ కోసం చంపానని వాదిస్తుంటుంది. ఆ సమయంలో ఈ కేసు విషయంలో సమీరాకు సాయం చేసేందుకు కరెప్టెడ్ పోలీసు అధికారి విక్రమ్ వాసుదేవ్(అడివి శేష్) సీన్ లోకి వస్తాడు. అయితే అతనో కండీషన్ పెడతాడు… తనకు అసలు నిజం చెపితేనే కేసు నుంచి కాపాడగలనని సమీరాకు చెపుతాడు. అ క్రమంలో సమీరా ఏం చెప్పింది…, అసలు నిజం ఏమిటి? అలాగే ఈ కేసుకు ఏడాది క్రితం తప్పిపోయిన వినయ్ వర్మ(మురళీ శర్మ)కు లింక్ ఏంటి? అన్న విషయాలు చుట్టూ కథ తిరుగుతుంది.