సీనియర్ నటి వాణి శ్రీ ఇంట విషాధం నెలకొంది. వాణి శ్రీ కుమారుడు అభినయ్ వెంకటేష్ కార్తీక్ హఠాన్మరణం చెందాడు. 36 ఏళ్ల అభినాయ్ వెంకటేష్ కార్తీక్ కు గుండెపోటు రావడంతో నిద్రలోనే మృతి చెందాడు. చెన్నైలో అన్నపూర్ణ మెడికల్ కాలేజీలో అభినయ్ కార్తిక్ డాక్టర్ గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య కూడా డాక్టర్. ఆ దంపతులకు నాలుగేళ్ల కుమారుడితో పాటు ఎనిమిది నెలల కుమార్తె కూడా ఉంది. అభియన్ మృతితో ఆ ఇంట్లో సహా చుట్టు పక్కల విషాధ ఛాయలు అలుముకున్నాయి. చిన్న వయసులోనే మృతి చెందడంతో ఆ వార్త కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక కన్నీరు మున్నీరవుతున్నారు.
వాణీశ్రీ కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు. ఒకానొక స్టేజ్ లో వాణీ శ్రీ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయినట్లు స్థానికులు చెప్పారు. చెంగల్పట్టు జిల్లా తిరుకల్ కుండ్రం ఫామ్ హౌస్ లో అభినయ్ కన్ను మూసాడు. అభినయ్ మృతిపట్లు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తంచేసారు. వాణి శ్రీ తెలుగు నటి. తెలుగు, తమిళ్ , కన్నడ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించారు. అయితే ఆమె వారసత్వం పుణికి పుచ్చుకుని కుమారుడు గానీ, కుమార్తె గానీ సినిమాల్లోకి రాలేదు. వాణీ శ్రీ తెలుగు నటి అయినా చెన్నైలోనే స్థిరపడ్డారు. అక్కడే సొంతిల్లు కల్గి ఉన్నారు. వాణీ శ్రీ భర్త కూడా వృత్తరీత్యా డాక్టర్. కుమార్తె అనుపమ కూడా డాక్టర్. మృతి చెందిన అభినయ్ కూడా డాక్టర్ కావడంతో ఆ ఫ్యామిలీ మొత్తం డాక్టర్స్ ఫ్యామిలీగా సెలబ్రిటీలలో పేరొందారు.