Rashmika Mandanna : మరీ అంత పెద్ద అందం లేకపోయినా జస్ట్ లక్ తో టాలీవుడ్ సినిమా సహా ఇతర ఇండస్ట్రీలో భారీ ఛాన్స్ లు అందుకుంటున్న యంగ్ హీరోయిన్స్ లో పూజా హెగ్డే మరియు నేషనల్ క్రష్ రష్మికా మందన్నా లు కూడా ఒకరు. ఇప్పుడు అయితే వీరి ట్రెండ్ నడుస్తుంది అని చెప్పాలి.
మరి ఇప్పుడు రీసెంట్ గా అయితే రష్మికా తన కెరీర్ లోనే భారీ హిట్ ని “పుష్ప” తో అందుకుంది.. దీని తర్వాత మరిన్ని ఆసక్తికర సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి. మరి ఇలాంటి హీరోయిన్ కి లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలి అనేవి కొన్ని కోరికలు కూడా ఉంటాయి కదా? అలానే లేటెస్ట్ గా తాను చేసిన కామెంట్స్ మంచి వైరల్ గా మారాయి.
తనకి కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్తూ.. తాను ప్రేమ పెళ్లి చేసుకుంటే మాత్రం ఇద్దరం కూడా ఒకేలా లవ్ చేసుకుంటేనే చేసుకుంటానని అలాగే నాకు భర్తగా కావాలి అంటే అతడితో కంఫర్ట్ గా ఫీల్ అవ్వడం, అతనితో ఉంటే భద్రతగా అనిపించాలి అలాంటి వాడిని అయితే పెళ్లి చేసుకుంటానని..
అలాంటి వ్యక్తి తనకి భర్తగా కావాలని అనుకుంటున్నట్టు ఆమె తెలిపింది. మరి రష్మికా ఎలాంటి వాడిని పెళ్లి చేసుకుంటుందో చూడాలి. ప్రస్తుతం అయితే ఈమె నటించిన చిత్రం ఆడవాళ్ళూ మీకు జోహార్లు రిలీజ్ కి రెడీగా ఉంది.