Pragya Jaiswal : ‘కంచె’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది ముద్దుగుమ్మ ప్రగ్యాజైశ్వాల్. తొలి సినిమాతోనే ఆకట్టుకుంది. కానీ, కెరీర్‌లో ఈ సినిమా తప్ప ప్రగ్యాకు చెప్పుకోదగ్గ సినిమానే లేకపోయింది. కానీ, సోషల్ మీడియాలో ప్రగ్యాకు చాలా ఫాలోయింగ్ వుంది.
అందుకు కారణం, ఆమె పోస్ట్ చేసే హాట్ హాట్ పిక్సే. క్లాసిక్ ఫేస్.. మాస్ క్యారెక్టర్స్‌లో సెట్ అవదనుకున్నారంతా ‘కంచె’లో ఆమెను చూడగానే.. కానీ, అంచెలంచెలుగా తనలోని క్లాస్ లుక్స్‌కి పదును పెట్టి, మాస్ అప్పీల్ కూడా చూపించింది. ‘జయ జానకి నాయకా’ సినిమాతో ఫుల్ డోస్ హాట్ షో చేసి, అదరహో అనిపించింది.
లేటెస్టుగా బాలయ్య బాబుతో ‘అఖండ’ సినిమాలో కనిపించిన ప్రగ్యా ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది. ఆశించినట్లే, సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. కానీ, ఆ హిట్టు ప్రగ్యా జైశ్వాల్‌కి ఏమాత్రం కలిసి రాలేదంటూ వాపోతోంది.
ఈ సినిమా సూపర్ హిట్ అయితే, అవకాశాలు పోటెత్తుతాయని ఎదురు చూసిందట. కానీ, అలా జరగలేదంటూ వాపోతోంది. మెగా ఫ్యామిలీ హీరోతో ఘనంగా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ, మళ్లీ మెగా కాంపౌండ్‌లో సినిమా చేయాలని ఆశపడుతోందట. ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క మెగా ఛాన్స్ అంటోంది ప్రగ్యా జైశ్వాల్. చూద్దాం.. త్వరలోనే ప్రగ్యా మెగా ఛాన్స్ కోరిక నెరవేరాలని ఆశిద్దాం.