నటి ఫేస్ బుక్ లో బూతు ఫొటోలు..గోలెత్తిపోతోంది

తన ఫేస్ బుక్ పేజీలో బూతు బొమ్మలు పోస్ట్ చేస్తున్నారంటూ నటి రంజిత వాపోతూ మీడియాకు ప్రకటన విడుదల చేసారు. అలా పోస్ట్ చేయటానికి కారణం తాను శబరిమలై ఇష్యూపై స్పందించటమే అన్నారు. మధ్య వయస్సు మహిళలు శబరిమలై కు వెళ్లటాన్ని వ్యతిరేకించటం చాలా మందికి నచ్చటం లేదన్నారు. వారంతా తన ఫేస్ బుక్ పేజీలో అశ్లీలు మెసేజ్ లు పెట్టడం, ఫొటోలు పెట్టడం చేస్తున్నారని ఆమె అన్నారు.

శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు వెళ్లవచ్చని రీసెంట్ గా సుప్రీంకోర్టు తీర్పుఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కొందరు మహిళలు ఆలయంలోకి వెళ్లేందుకు యత్నించగా, హిందూ సంఘాలు అడ్డుకున్నాయి. స్త్రీలు శబరిమలకు వెళ్లరాదని పలువురు మహిళలు సైతం ఆందోళనకు దిగారు.

వీరిలో ప్రముఖ నటి రంజిత కూడా ఉన్నారు. తాజాగా శబరిమలకు వెళ్లేందుకు ప్రయత్నించిన కొందరు మహిళలపై నటి రంజిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉండాల్సిన ఆలయ ప్రాంతంలో కొందరు వ్యక్తులు అనవసరంగా వివాదాలు సృష్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు. భక్తులకు సంబంధించిన అంశాలను రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. వీరి కారణంగా నిజమైన భక్తులకు స్వామివారి దర్శనం చేసుకోలేని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు.

ఆ మధ్య రెహానా ఫాతిమాను పోలీసులు అరెస్ట్‌ చేయడాన్ని ఆమె సమర్థించారు. దీంతో కొందరు మహిళలు.. ఒక స్త్రీ అయి ఉండి సాటి స్త్రీలకు వ్యతిరేకంగా మాట్లాడతావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. మరి కొందరు శబరిమలకు వెళ్లే ముందు తన ఫేస్‌బుక్‌లో అశ్లీల చిత్రాలను పోస్ట్‌ చేస్తున్నారని, ఈ పనులు క్రిమినల్‌ కేసు కిందకు రావా? అంటూ నటి రంజిత శనివారం ఒక ప్రకటనను మీడియాకు విడుదల చేస్తూ వాపోయారు.