లాక్ డౌన్ తో అందరికీ ఇబ్బందులు మొదలయ్యాయి. అన్ని రంగాలు కన్నా ఈ ప్రభావం సినిమా వాళ్లపై…అందులోనూ చిన్న చిన్న ఆర్టిస్ట్ లు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర సరుకులు పంచినా..బయటకు చెప్పుకోలేని ఆర్ధిక ఇబ్బందులు ప్రతీ పేద…మధ్య తరగతి కుటుంబాల్లో సహజమే. అయితే ఈ లాక్ డౌన్ సమయంలో తెలుగు ఇండస్ర్టీలో బాగా పేరున్న నటి…బాగానే సంపాదిస్తున్న నటి ఓ నిర్మాత చేతుల్లో ఇరుక్కుపోయిందిట. సడెన్ గా 30 లక్షలు రూపాయలు అవసరం పడటంతో వెంటనే సదరు నిర్మాతని అడిగి అప్పుగా తీసుకుందిట. బాగా తెలిసిన నటి కావడం…వాళ్ల బ్యానర్లోనే చాలా సినిమాల్లో నటించడం..వ్యక్తిగతంతో ఉన్న పరిచయం.. నమ్మకంతో అడిగిన మొత్తాన్ని సింగిల్ పేమెంట్ గా నిర్మాత ఇచ్చాడుట.
ఇంతకీ ఎవరా నిర్మాత? ఎవరా నటి? అంటే. ఆమె అమ్మ పాత్రల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దాదాపు ఇప్పుడు స్టార్ హీరోలగా చలామాణి అవుతోన్న వారందరి చిత్రాల్లో అమ్మ పాత్రలన్నీ ఆమెకే దక్కుతున్నాయి. అప్పుడప్పుడు అత్త..అక్క…చెల్లి పాత్రల్లో కనిపిస్తుంది. చిన్న చిన్న సినిమాల్లోనూ నటిస్తుంది. అయితే పరిశ్రమకు వచ్చే క్రమంలో ఆమె లైంగిక చాలా ఇబ్బందులు ఎదుర్కున్నట్లు పలు ఇంటర్వూల్లో తెలిపింది. సినిమా వాళ్ల విషయంలో ఎవర్నీ నమ్మకూడదని..అలాగని అంతా చెడ్డవారు కాదని..మంచి వాళ్లు ఉన్నారని..కానీ ఒకరి వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుందని తెలిపింది.
కష్టాల్లో ఉన్నప్పుడు ఆ సినిమా వాళ్లు తనని ఆదుకున్నారని అంది. ఇక ఆ నిర్మాతపై ఇప్పటికే కొన్ని రకాల ఆరోపణలున్నాయి. తన సినిమా ఆఫీస్ లో అసాంఘిక కార్యకలాపాలు నెరిపినట్లు అప్పట్లో కథనాలు వేడెక్కించాయి. ఆ నటితో చాలా కాలంగా వ్యక్తిగత పరిచయం ఉన్నట్లు ప్రచారం సాగింది. హీరోయిన్లతో, ఆర్టిస్టులతో..లేడీ సింగర్లతో సన్నిహితంగా మెలుగుతాడని..అవకాశం పేరుతో కమింట్ మెంట్ అడుగుతాడని మీటూ సమయంలో ఆ నిర్మాత పేరు తెరపైకి వచ్చింది.
