ఖుష్భూ ప్రెవేట్ పార్ట్స్ తాకిన కార్యకర్త.. చెంప పగిలింది

జనం మధ్యలో ఉన్నప్పుడు ఏం చేసినా ఎవరికీ తెలియదు అన్న ధోరణిలో కొందరు అసభ్యంగా ప్రవర్తిస్తూంటారు. అయితే అది సార్లు చెల్లుబాటు కాదు…ఒక్కోసారి చెప్పుదెబ్బలు తినాల్సి వస్తుంది. ఓ పార్టీ కార్యకర్త చేసిన వెధవ పనికి వెంటనే బుద్ది చెప్పారు ఖుష్బూ.

వివరాల్లోకి వెళితే…బెంగుళూరు సెంట్రల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి రిజ్వాన్‌కి మద్దుతుగా ప్రచారం నిర్వహించిన సీనియర్ నటి ఖుష్భూకి చేదు అనుభవం ఎదురైంది. ఖుష్బూ…బెంగుళూరు సెంట్రల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి రిజ్వాన్‌కి మద్దుతుగా ప్రచారం నిర్వహించారు. ప్రచారం ముగించుకుని కారు ఎక్కేందుకు వెళ్తున్న ఖుష్బూని కార్యకర్తలు చుట్టిముట్టి పూలుజల్లుతూ హడావుడి చేశారు.

చాలా మంది కార్యకర్తలు ఆమెను చుట్టుముట్టడంతో ఇదే అదునుగా భావించిన ఓ కార్యకర్త ఖుష్భూతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఆమె ప్రైవేట్ పార్ట్స్‌ని తాకే ప్రయత్నం చేశాడు. దీంతో అలర్ట్ అయిన ఖుష్భూ.. వెనక్కి తిరిగి వచ్చి మరీ.. ఆ వ్యక్తిని పట్టుకుని చెంప చెళ్లుమనిపించింది.. జనం మధ్యలో కాలర్ పట్టుకుని చెంపదెబ్బలు కొడుతూ..ఖష్భూ వాడికి ఓ రేంజిలో బుద్ది చెప్పింది. ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది. అయితే ఈ విషయమై ఖుష్బూ ఏ కేసు పెట్టలేదు.