ప్రముఖ నటుడుపై ‘సెక్స్ పర్వర్ట్’ అంటూ నటి రేవవి ఆరోపణలు ఇప్పుడు మళయళ చిత్ర పరిశ్రమను ఊపోస్తోంది. మలయాళ ఇండస్ట్రీకి చెందిన ప్రఖ్యాత నటుడు సిద్దిఖీ మీద సెక్సువల్ హరాస్మెంట్ ఆరోపణలు తెరపైకి వచ్చాయి. మలయాళ నటి రేవతి సంపత్ తాజాగా తన ఫేస్ బుక్ పేజీ ద్వారా సిద్ధిఖీ బండారాన్ని బట్టబయలు చేసింది.
2016లో ఓ సినిమా స్క్రీనింగ్ సందర్భంగా సిద్ధిఖీ తనను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు చేశారు. 21 ఏళ్ల వయసులో తాను ఈ వేధింపులకు గురైనట్లు తెలిపారు. తీవ్ర మానసిక వేదనకు గురయ్యా ‘సుఖమాయిరికటే’ అనే చిత్రం 2016లో విడుదలైంది.
త్రివేండ్రంలోని నీలా థియేటర్లో ఈ మూవీ స్క్రీనింగ్ సమయంలో సిద్ధికీ తన పట్ల సెక్సువల్ మిస్ బిహేవ్ చేశాడని రేవతి ఆరోపించారు. అతడి ప్రవర్తన వల్ల 21 ఏళ్ల వయసులో తాను తీవ్రమైన మానసిక వేదనకు గురైనట్లు తెలిపారు. అతడి వల్ల తన మనసుకు తగిలిన గాయం ఇప్పటికీ బాధిస్తూనే ఉందని ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించారు.
అతడికి నా వయసున్న కూతురు కూడా ఉంది సిద్ధిఖీకి తన వయసు గల కూతురు ఉందని…. ఇలాంటి వ్యక్తుల వల్ల కూతుళ్లకు కూడా సరైన భద్రత ఉండకపోవచ్చని రేవతి వ్యాఖ్యానించారు. మంచితనం మసుగులో ఎందరో కీచకులు మలయాళం సినీ ఇండస్ట్రీలో మంచి వారిగా ముసుగు వేసున్న ఎందరో కీచకులు ఉన్నారని, వారంతా ప్రజల ముందు జెంటిల్మెన్‌గా ఫోజులు కొడుతున్నారని, ఏదో ఒక రోజు అలాంటి వారి పాపం పండుతుందని రేవతి సంపత్ వ్యాఖ్యానించారు.