జర్నలిస్ట్ పాత్రలో నమిత

శృంగారాన్ని అంగాంగాల్లో పలికించే నమిత గుర్తుందికదా ! చాలా కాలం నుంచి ఈ  భామ తెర మీద కనిపించడం లేదు . ఇప్పుడు ఓ తమిళ సినిమాలో నటిస్తుంది . ఈ సినిమా పేరు “ఆగం పావం ” ఈసినిమాకు దర్శకుడు శ్రీమగేష్ . గతంలో ఇతను శరత్ కుమార్ తో ఛత్రపతి సినిమా తీశాడు . ఇప్పుడు నమిత ప్రధాన పాత్రలో ఈ సినిమా రూపొందిస్తున్నాడు . నిన్ననే  ఈ చిత్రం షూటింగ్ చెన్నై లో మొదలైంది .

 ఏ సినిమా గురించి నమిత చాలా సంతోషంగా వుంది . తన పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉందని , జర్నలిస్ట్ సమాజానికి ఏరకంగా ఉపోయోగ పడతాడో , రాజకీయ నాయకుల కుయుక్తులను ఎదుర్కొంటూ ఎలా నెగ్గుకొస్తాడో తెలుసుకున్నా . ఎందుకంటే నేను మొదటిసారి జర్నలిస్ట్ గా నటిస్తున్నా కదా , అందుకే ప్రిపేర్ అవుతున్నా అని చెప్పింది .

అయితే చిన్న అసంతృప్తి ఉందని అన్నది , ఏమిటని జర్నలిస్టులు అడిగారు . ఈ పాత్రకు గ్లామర్ వుండదుగా అంటూ నవ్వేసింది . అంటే జర్నలిస్ట్ పాత్రలో కూడా గ్లామర్ వుండాలని నమిత కోరుకుంటుందా ?