ఇంతలోనే తమన్నాలో ఎంత మార్పు !

ఇంతలోనే తమన్నాలో ఎంత మార్పు !

అందాల తార తమన్నా ఈ మధ్య అడక్కుండానే బోలెడు విషయాలు చెబుతోంది. గతంలో ఎంత అడిగినా, నోరు విప్పేది కాదు. తమన్నాలో వచ్చిన మార్పు చూసి చిత్రసీమతో పాటు, మీడియా కుడా నివ్వెరపోతోంది. ”నా సినిమా బాగా ఆడితే ఎంత ఆనందిస్తానో.. నేను నటించని సినిమా ఆడినా అంతే సంతోషిస్తాను. ఎందుకంటే చిత్రసీమ బాగుండాలి. అప్పుడే నేను బాగుంటా” అంటోంది తమన్నా!

ఈ బ్యూటీ తాజాగా ‘సైరా’లో ఓ కీలక పాత్ర పోషించింది. ప్రభుదేవాతో ‘అభినేత్రి-2’. ఎలా మంచి జోరుమీదుంది. ”చిత్ర సీమకు విజయాలు చాలా అవసరం. వంద సినిమాలు విడుదలైతే.. అందులో పది మాత్రమే విజయం సాధిస్తాయి. ఇప్పుడున్న పోటీలో ప్రేక్షకుల మెప్పు పొందడం అంత తేలికైన విషయం కాదు. అలాంటి నేపథ్యంలో ప్రతీ విజయమూ మధురమే! అందులో నేనున్నానా? లేనా? అనేది ఆలోచించను. ‘ఫలానా సినిమా హిట్టయిందట’ అనే మాట ఎప్పుడు విన్నా మనసు ఆనందంతో నిండిపోతోంది. ఎందుకంటే ఇది నా పరిశ్రమ. ఎక్కడ ఒంటరిగా ఎవరూ ఎదగరు. తాము ఎదుగుతూ మరింతమందిని నడిపిస్తుంటారు. ఓ సినిమా ఆడిందంటే చాలామంది లాభపడతారు. ప్రతి నిర్మాత లాభపడాలి. అప్పుడే కదా మరో సినిమా తీస్తారు. ఎప్పుడు కాకపోయినా మరో సారైనా నాకు అవకాశం ఇస్తారు ” అంటూ ఆశావాహ దృక్పథంతో చెప్పుకొచ్చింది తమన్నా. బాప్ రే… భలే నేర్చిందే తమన్నా.. అనకుండా ఉండగలమా?