బాప్ రే.. తమన్నా! ఇప్పటికీ అంత రెమ్యూనరేషనా?

Tamannah Bhatia
టాలీవుడ్ లో ఎప్పుడు ఎవ్వరినోటా విన్నా ఇదేమాట! వచ్చిన ఆఫర్లలో నటనకు అవకాశం ఉన్నవాటినే మాత్రమే ఎంచుకుంటోంది. ఆలా తమన్నా తన సెకండ్ ఇన్నింగ్ ని జెట్ స్పీడ్ వేగంతో చాలా వైవిధ్యంగా మలుచుకుంటూ కెరీర్ లో దూసుకుపోతోంది.
 
Tamannah Bhatia
 
ఇక అసలు విషయానికొస్తే.. తాజాగా ఇండస్ట్రీ లో అందరూ ‘బాప్ రే.. తమన్నా’ అంటున్నారు. అందుకు కారణం లేకపోలేదు. నితిన్ ‘అందాదున్’ రీమేక్ లో టబు పాత్రలో చేయడానికి అంగీకరించడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. పైగా ఆ క్యారెక్టర్ నెగటివ్ షేడ్సుతో  ఉన్న మధ్య వయసు మహిళ పాత్ర. ఛాలెంజ్ కు సిద్ధపడే తమన్నా ఈ పాత్రను ఓకే చేసిందిట.
 
అంతే కాకుండా  ఈ క్యారెక్టర్ చేయడానికి  కోటిన్నర వరకు  రెమ్యునరేషన్ కూడా తీసుకుంటోందిట. అప్ కమింగ్ హీరో సత్యదేవ్ తో కన్నడ రీమేక్ ‘గుర్తుందా శీతాకాలం’ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్. చాలా డెప్త్ తో ఎమోషనల్ గా సాగుతుంది. ఊహించని షేడ్సు ఉంటాయి. రెగ్యులర్ గ్లామర్ పాత్ర కాదు కాబట్టి ఇదీ ఒకరకంగా రిస్కే.  
 
హీరో ఎవరు అనేది పట్టించు కోకుండా తమన్నాదీనికి ఓకే చెప్పింది.  తమన్నా ప్రస్తుతం గోపీచంద్‌తో ‘సీటీమార్‌’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. మొత్తానికి తమన్నా రెగ్యులర్ పాత్రలు కాకుండా ఇలాంటి డిఫరెంట్ జానర్ ఎంచుకోవడం మంచి విషయమే.