ట్విట్టర్ రివ్యూ : “ఎఫ్ 3″…ఎఫ్ 2 మించి హిట్ అయ్యిందా? ఆడియెన్స్ ఏమంటున్నారు?

ఏ సినిమా అయినా కూడా యూననిమస్ గా అవ్వాలి అంటే.. ఓపెనింగ్స్ రెండు మూడు రోజుల వరకు అభిమానులు పాత్ర మాత్రమే ఉంటుంది కానీ మిగతా రోజుల్లో సక్సెస్ అవ్వాలి అంటే ఫ్యామిలీ ఆడియెన్స్ ని రప్పిస్తేనే ఆ సినిమా హిట్ అయ్యి తీరుతుంది. అలాంటి సత్తా ఉన్న సినిమాగా కేవలం ఫ్యామిలీ ఆడియెన్స్ ని టార్గెట్ చేస్తూ వచ్చిన లేటెస్ట్ చిత్రం “ఎఫ్ 3”.

విక్టరీ వెంకటేష్ మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లు హీరోలుగా నటించిన ఎఫ్ 2 ఎంత పెద్ద హిట్టయ్యిందో దానికి సీక్వెల్ గా అంతకు మించిన నవ్వులతో తెరకెక్కించిన ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమాకి ఆడియెన్స్ తమ రెస్పాన్స్ ని ప్రీమియర్ లు చూసేసిన వాళ్ళు ట్విట్టర్ లో తమ రివ్యూస్ చెప్పేస్తున్నారు. అయితే ఒక సెక్షన్ ఆడియెన్స్ ని పక్కన పెడితే మళ్లీ ఫ్యామిలి ఆడియెన్స్ మరియు న్యూట్రల్ ఆడియెన్స్ లో మాంచి పాజిటివ్ టాక్ వినిపిస్తుంది.

ఎఫ్ 2 కన్నా ఇందులో వెంకీ మామ కామెడీ అదిరిపోయింది అని అంటున్నారు. అలాగే మన హీరోలపై చూపించిన కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్లు బాగున్నాయట. అలానే కామెడీ అయితే మళ్లీ చాలా కాలం తర్వాత ఫుల్ గా సినిమా చూసి నవ్వుకున్నాం అంటున్నారు. లేడీస్ కి ఈ సినిమా బాగా నచ్చుతుంది అని, సునీల్ కూడా మంచి కామెడీ చేసాడని అంటున్నారు. అలాగే తమన్నా రోల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఈ సినిమాలో ఉందట.

అలాగే డీఎస్పీ మ్యూజిక్ ఓకే కాగా ఫ్యామిలీ అంతా డెఫినెట్ గా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారని అంటున్నారు. అయితే లాస్ట్ టైం ఎఫ్ 2 కి ఎలా అయితే రోత కామెడీ ఉందని టాక్ వచ్చిందో దీనికి కూడా అలాంటి టాక్ కొద్దిగా వినిపిస్తోంది. కానీ ఈ సినిమా కూడా ఫైనల్ గా ఫ్యామిలీ ఆడియెన్స్ ని లాగేస్తుంది అని అంటున్నారు…