అతడితో తమన్నా ‘లవ్‌ మాక్‌టైల్‌’!?

Tamannah Bhatia

తమన్నా ఎప్పటికప్పుడు తన పంథాను మార్చుకుంటూ  కెరీర్ ను  కొనసాగిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో నటించి నటిగా మంచి పేరు తెచ్చుకున్న ఈ భామ తాజాగా వెరైటీ పాత్రల వైపు తొంగిచూస్తోంది.

Tamannah Bhatia
Tamannah Bhatia

ఇకపై తను నటించే చిత్రాల్లో హీరో ఎవరు? అని కూడా చూడదట. కథ నచ్చి, పాత్ర బావుంటే నటించడానికి సై అంటోందిట. అందులో భాగంగానే కన్నడలో ఘన విజయం సాధించిన ‘లవ్‌ మాక్‌టైల్‌’ సినిమాను తెలుగులో రీమేక్‌ చేయడానికి రంగం సిద్ధం అయ్యింది. ఇందులో సత్యదేవ్, తమన్నా జంటగా నటించనున్నారు. నాగ శేఖర్‌ మూవీస్‌ బ్యానర్‌పై నాగశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కనుంది. భావనా రవి, నాగశేఖర్‌ నిర్మాతలు.

ఈ రీమేక్‌కి సంబంధించిన రెగ్యులర్‌ షూటింగ్‌ని ఈ నెలలోనే ఆరంభించడానికి సన్నాహాలు చేస్తున్నారట. కీరవాణి వారసుడు కాల భైరవ ఈ చిత్రానికి  సంగీతం అందిస్తున్నారు. సత్య హెగ్డే సినిమాటోగ్రాఫర్‌గా వర్కు చేయబోతున్నారు.