అభ్యర్థులకు ఆ సినిమాలు సింహ స్వప్నమే

డిసెంబర్ 7న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ జరుగుతుంది . అంటే శుక్రవారం రోజున  ఏడు  తెలుగు సినిమాలు  విడుదలవుతున్నట్టు తెలిసింది .

కవచం , సుబ్రమణ్యపురం, శుభ లేఖలు, నెక్స్ట్ ఏంటి ? అవి కాక మరో మూడు సినిమాలు కూడా ఉండవచ్చని తెలుస్తుంది .

ఈ వార్త ఇప్పుడు అభ్యర్థుల్లో గుబులు పుట్టిస్తుంది . కొత్త సినిమాలు అనగానే యూవతి యువకులు సినిమాలకు చెక్కేస్తుంటారు . అందులో ఒకటి కాదు ఏడు సినిమాలు అంటే అందరిలో దడ పుట్టిస్తున్నది .

అసలే వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి . ఉద్యోగస్తులు ఓటు వెయ్యకుండానే ఊళ్లకు వెడతారేమో అని నిన్న మొన్నటి వరకు కలవర పడ్డారు .

తాజాగా సినిమాల విడుదల  మరింత కంగారు కలిగిస్తుంది . అసలే టి .ఆర్ .ఎస్ , ప్రజా కూటమి మధ్య గట్టిపోటీ నెలకొని వుంది . ఇలాంటి పరిస్థితుల్లో సెలవులు, సినిమాలు అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి .