సోహెల్‌కు బంప‌ర్ ఆఫ‌ర్.. జార్జిరెడ్డి నిర్మాత‌ల‌తో తొలి సినిమా చేయ‌బోతున్న బిగ్ బాస్ కంటెస్టెంట్

బిగ్ బాస్ సీజ‌న్ 4 సంచ‌ల‌నం సోహెల్ విన్న‌ర్ కాక‌పోయిన అంత‌క‌న్నా ఎక్కువ క్రేజ్ పొందాడు. రూ. 25ల‌క్ష‌ల రూపాయ‌ల‌తో హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన సోహెల్ ఇందులో రూ.5 ల‌క్ష‌ల రూపాయ‌లు చారిటీకి ఇస్తాన‌ని, మ‌రో రూ.5 ల‌క్ష‌ల రూపాయ‌లు మెహ‌బూబ్‌కు ఇస్తాన‌ని అన్నాడు. సోహెల్ ఔదార్యాన్ని చూసి మురిసిపోయిన నాగ్ నువ్వు ఇస్తాన‌న్న ప‌ది ల‌క్ష‌లు నేనే ఇస్తాను, అవి నువ్వు ఇంటికి తీసుకెళ్ళు అని చెప్ప‌డంతో తెగ సంతోషించాడు సోహెల్‌. ఇక చిరంజీవి సోహెల్ కోసం ప్ర‌త్యేకంగా మ‌ట‌న్ బిర్యానీ పంప‌డం, అత‌ను సినిమా చేస్తే అందులో చిన్న రోల్ ప్లే చేస్తాన‌ని అన‌డంతో సోహెల్‌కు ఎక్క‌డా లేని క్రేజ్ వ‌చ్చేసింది.

బిగ్ బాస్ ఫినాలేలో త‌ను ఒక మంచి సినిమా చేస్తాన‌ని చిరంజీవి ముందే చెప్ప‌గా, నీ సినిమాకు నా సపోర్ట్ త‌ప్ప‌క ఉంటుంద‌ని అన్నారు. ఈ క్ర‌మంలో సోహెల్ సినిమా ఎప్పుడు ఉంటుందా అని అంద‌రు ఎదురు చూస్తున్న క్ర‌మంలో కొత్త సినిమా ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. జార్జిరెడ్డి, ప్రెష‌ర్ కుక్క‌ర్ నిర్మాత అప్పి రెడ్డి సోహెల్ హీరోగా సినిమా తీయ‌నుండ‌గా, ఈ సినిమాని డెబ్యూ డైరెక్ట‌ర్ శ్రీనివాస్ వింజనంపతి తెర‌కెక్కించనున్నాడు. చిత్రానికి సంబంధించిన టైటిల్ ఏంటీ, ఇందులో న‌టీనటులు ఎవరు అనే విష‌యాన్ని త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్నారు.

సోహెల్ బిగ్ బాస్ సీజ‌న్‌కు రాక‌ముందు అనేక సినిమాలు, సీరియ‌ల్స్‌లో న‌టించాడు. కాని అత‌నికి ఎప్పుడు ప్ర‌త్యేక గుర్తింపు రాలేదు. బిగ్ బాస్ సీజ‌న్ 4లో అడుగుపెట్టిన త‌ర్వాత సోహెల్ పేరు అంత‌టా మారుమ్రోగింది. అత‌ను ఫ్రెండ్‌షిప్‌కు ఇచ్చే ఇంపార్టెన్స్ ప్ర‌తి ఒక్క‌రిని క‌దిలించింది. విన్న‌ర్ అయిన అభిజీత్ క‌న్నా కూడా సోహెల్‌తోనే ఇంట‌ర్వ్యూలు చేసేందుకు అంద‌రు ఆస‌క్తి చూపుతున్నారు. నిర్మాత‌లు కూడా సోహెల్‌తో సినిమా చేయాల‌ని ప్లాన్స్ చేసుకుంటున్నారు.