నాకున్న డ్రీమ్స్‌లో అది కూడా ఒకటి.. పవన్ కళ్యాణ్‌పై నాగబాబు కామెంట్స్

NagaBabu Wants To See Pawan Kalyan In George Reddy Character

మెగా బ్రదర్, టవర్ స్టార్, లాఫింగ్ స్టార్ ఇలా ఎలా పిలిచినా సరే నాగబాబుకు ఉండే ప్రత్యేకతే వేరు. ఈ మధ్య సోషల్ మీడియాలో ఆయన ఎంత యాక్టివ్ అయ్యారో చూస్తే ఆశ్చర్యపోయారు. యూట్యూబ్, ఇన్‌స్టా, ట్విట్టర్ ఇలా ప్రతీ చోటా నాగబాబు తన హవాను కొనసాగిస్తున్నాడు. మరీ ప్రత్యేకంగా యూట్యూబ్‌లో ప్రవచనాలు, సూక్తులు, జీవిత సత్యాలను వివరిస్తూ ఎందరికో కనువిప్పు కలిగిస్తున్నాడు.

  NagaBabu Wants To See Pawan Kalyan In George Reddy Character

NagaBabu Wants To See Pawan Kalyan In George Reddy Character

యూట్యూబ్‌లో నాగబాబు వెల్లిబుచ్చే అభిప్రాయాలపై ఒక్కోసారి వివాదాలు ఏర్పడుతాయి. తాజాగా నాగబాబు పవన్ కళ్యాణ్ ఫోటోపై ఓ కామెంట్ చేశాడు. నేటి ఉదయం నుంచి యవ్వనంలో ఉన్న పవన్ కళ్యాణ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. ఆ ఫోటోనూ నాగబాబు షేర్ చేస్తూ.. ఇలాంటి ఫోటోలు చాలా ఉన్నాయి.., నా దగ్గర దాచనంతే… ! అంటూ ఎప్పటికీ ఓ గొప్ప సోదరుడు.. ఎప్పటికీ నిలిచిపోయే ప్రేమ ఉంది అని తెలిపాడు.

  NagaBabu Wants To See Pawan Kalyan In George Reddy Character

NagaBabu Wants To See Pawan Kalyan In George Reddy Character

నెటిజన్లు ఈ ఫోటోపై పలు రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు చేగువేరాలా ఉన్నారంటే.. మరికొందరు జార్జ్ రెడ్డిలా ఉన్నారని అంటున్నారు. ఓ నెటిజన్ మాత్రం.. ఒకవేళ ఆ సమయంలో పవన్ కళ్యాణ్‌తో జార్జ్ రెడ్డి సినిమా తీసి ఉంటేనా అంటూ కామెంట్ చేశాడు. దానికి నాగబాబు రిప్లై ఇస్తూ.. నాకున్న కలల్లో అది కూడా ఒకటి.. పవన్ కళ్యాణ్ జార్జ్ రెడ్డి చిత్రాన్ని, పాత్రను చేయాలని ఉండేదన్న విషయాన్ని బయటపెట్టాడు.

  NagaBabu Wants To See Pawan Kalyan In George Reddy Character

NagaBabu Wants To See Pawan Kalyan In George Reddy Character