24X7 అబ్బాయిలకి అదే ఆలోచనా? తమన్నా ప్రశ్న

సందీప్ కిషన్, తమన్నా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘నెక్స్ట్ ఏంటి?’. రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ కునాల్ కోహ్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని రైనా జోషి, అక్షయ్ పూరిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఇక టీజర్ లో తమన్నా ఫ్రెష్ లుక్‌లో చాలా కొత్తగా కనిపించగా.. ప్లే బాయ్‌గా సందీప్ కిషన్  కనిపిస్తున్నాడు. ఈ టీజర్‌ యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది.కాగా, వరుస ప్లాపులతో సతమతవుతున్న సందీప్ కిషన్ కు ఈ సినిమా అయినా విజయాన్ని అందిస్తుందో.. లేదో చూడాలి. మరి తాజాగా విడుదలైన టీజర్ పై మీరు ఓ లుక్కేయండి.

Next Enti Official Teaser | Next Enti New Telugu Movie | Sundeep Kishan, Tamannaah Bhatia, Navdeep

 

‘లైఫ్ చాలా చిన్నదిరా.. మళ్లీ మళ్లీ అవకాశాలు రావు, అందులోనూ అమ్మాయిల విషయాల్లో అస్సలు రావు’ అంటూ అమ్మాయిలతో రొమాన్స్, లిప్ లాక్‌లతో సందీప్ కిషన్ రెచ్చిపోవటం టీజర్ లో హైలెట్ గా నిలిచింది. ప్రేమ – శృంగారం మేళవింపుతో యువతని ఆకట్టుకునేలా చేసేలా ‘నెక్స్ట్ ఏంటి?’ ఉండబోతుందని టీజర్‌లో చూపించారు.

ప్రస్తుతం నిర్మాణాంతర కార్య​క్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు. ‘ఫనా, హమ్‌ తుమ్‌’ వంటి బాలీవుడ్‌ హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన కునాల్‌ కోహ్లి సందీప్‌ కిషన్‌కు హిట్‌ అందిస్తాడని ఎంతో నమ్మకంతో ఉన్నాడు. ఇక ఈ చిత్రానికి లియోన్‌ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు.

సందీప్‌ కిషన్‌, తమన్నా జంటగా, నవదీప్‌, పూనమ్‌ కౌర్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రైనా జోషి, అక్షయ్‌ పూరి నిర్మించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.