లాక్ డౌన్ కారణంగా దేశం ఆర్ధికంగా అంకంతకు వెనక్కి వెళ్లింది. అప్పటికే తీవ్ర సంక్షోభంలో ఉన్న దేశాన్ని కొవిడ్-19 మరింత కష్టాల్లో కూరుకునేలా చేసింది. అన్ని రంగాలు ఇప్పుడు తీవ్రం సంక్షోభంలో పడ్డాయి. నష్టాలను అధిగమించి ఎలా బయటపడాలని అన్ని పరిశ్రమలు తలమునకలయ్యాయి. కేంద్రం ఇస్తోన్న సడలింపులకు అనుగుణంగా నిర్ణయాలతో ఒక్కొక్కటిగా పరిశ్రమలు పున ప్రారంభం అవుతున్నాయి. అయితే ఈ నష్టాలు అధిగమించి లాభాలు భాట పట్టడానికి కనీసం ఏడాదిన్నర నుంచి రెండేళ్లైనా సమయం పడుతుందని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అదీ ఆయా రంగాలను బట్టి కాల నిర్ణయం జరుగుతోంది.
అయితే సినిమా రంగం నుంచి గడిచిన 75 రోజుల్లో దేశ వ్యాప్తంగా 2250 వేల కోట్ల నష్టం వచ్చినట్లు కేంద్రం తెలిపింది. రోజుకు 30 కోట్ల ఆదాయన్ని సినిమా రంగం నుంచి కోల్పోయినట్లు తేలింది. ఈ మొత్తం కేవలం సినిమా టిక్కెట్ ద్వారా వచ్చేది. దేశ వ్యాప్తంగా 9500 థియేటర్లు ఉన్నాయి. లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా థియేటర్లనీ మూత పడ్డాయి. దీంతో రోజుకు 30 కోట్లు చొప్పున 75 రోజులకు 2550 కోట్లు నష్టం వచ్చినట్లు అధికారులు తేల్చారు. ఇక తాజా పరిస్థితుల నేపథ్యంలో థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో సినిమాల నుంచి వచ్చే ఆదాయాన్ని థియేటర్లు తెరిచే వరకూ కోల్పోవడమేనని వెల్లడించారు.
ఇది ప్రభుత్వానికి ఊహించని నష్టమని తెలిపారు. గడిచిన కొన్ని దశాబ్ధాలుగా ఇలాంటి విపత్తులు ఎప్పుడూ తలెత్తలేదని…ఇది చరిత్రలో నిలిచిపోయే విపత్తు అని ఉద్ఘాటించారు. ఇంకా టీవీ రంగం నుంచి వచ్చే ఆదాయం నష్టం కూడా భారీగానే ఉంటుందని తెలిపారు. అలాగే లాక్ డౌన్ కారణంగా నిర్మాతలు, డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల నష్టాల కూడా భారీగానే ఉంటాయన్నారు. థియేటర్లు పున ప్రారంభించే వరకూ పరిస్థితి ఇలాగే ఉంటుందని స్పష్టం చేసారు. ఇప్పటికే కొన్ని రాష్ర్టాల్లో సినిమా షూటింగ్ లకు అనుమతలిచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల నుంచి షూటింగ్ లు చేసుకోవచ్చని ముఖ్యమంత్రులు తెలిపారు. పరిమిత స్టాప్ తో ప్రభుత్వ సూచలను పాటిస్తూ షూటింగ్ లు చేసుకోవచ్చు.