దక్షిణాదిన అత్యంత ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మరియు బాలీవుడ్ లో క్రేజీ ప్రొడక్షన్ హౌస్గా ముద్ర వేసుకున్న నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ బ్యానర్ పై నమిత్ మల్హోత్ర సంయుక్తంగా 1500 కోట్ల కి పైగా చారిత్రాత్మకంగా భారతదేశం లోనే అత్యంత భారీ
బడ్జెట్ చిత్రం గా రామయణ్ ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు.
గజిని వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని బాలీవుడ్ లో నిర్మించిన తెలుగు వాడు మధు మంతెన ఈ చిత్రం నిర్మాణ భాద్యతలు నిర్వహిస్తున్నారు. దంగల్ లాంటి అత్యద్భుత మైన చిత్రానికి దర్శకత్వం వహించిన నితేష్ తివారి మరియు మామ్ లాంటి సెన్సిటివ్ బ్లాక్‌బస్టర్ చిత్రానికి దర్శకత్వం వహించిన రవి ఉద్యావర్ లు సంయుక్తంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రాన్ని మూడు భాషల్లో మూడు భాగాలుగా నిర్మాణం చేపడుతున్నారు. ఓక్కో భాగాన్ని 500 కోట్లకి పైగా బడ్జెట్ తో నిర్మిస్తారు. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల ఎంపిక పాన్ ఇండియా నుంచి ఎంచుకుంటారు. సౌత్ నిర్మాణ సంస్థల్లో గీతాఆర్ట్స్ ఇలాంటి భారీ చిత్రాన్ని నిర్మించటం ఇదే ప్రధమం. ఈ చిత్ర షూటింగ్ డిసెంబర్ నుండి మెదలవుతుంది.