సూపర్ స్టార్ మహేష్ – నమ్రత .. సౌతిండియా ఆదర్శ జంటగా అభిమానుల గుండెల్లో నిలిచిన సంగతి తెలిసిందే. కెరీర్ పరంగా మహేష్ ఎంత బిజీగా ఉన్నా.. వందశాతం పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక మహేష్ ఎదుగుదల కోసం నమ్రత అన్నీ తానే అయ్యి లైఫ్ ని డిజైన్ చేయడం వల్లనే ఇంతింతై అన్న చందంగా ఎదిగారని అభిమానులు చెబుతుంటారు. వారసులు గౌతమ్ – సితార బాధ్యతను నమ్రత స్వయంగా దగ్గరుండి చూసుకుంటున్నారు. ఒత్తిడిని దరి చేరనివ్వకుండా.. కుటుంబానికి ఖాళీ సమయాన్ని కేటాయించడం.. విదేశీ విహారాలు సహా మహేష్ పంక్చువాలిటీ అందరికీ ఆదర్శం.
అంతేకాదు.. మహేష్ – నమ్రత జంట ప్రేమకథ ఒక రియల్ సినిమానే తలపించేదిగా ఉంటుంది. పలు ఇంటర్వ్యూల్లో నమ్రత తన ప్రేమకథకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. నేడు సోమవారం ఈ జంట 15 వ వెడ్డింగ్ యానివర్శరీని జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహేష్ – నమ్రత తమ ఎమోషనల్ మూవ్ మెంట్ ని అభిమానులతో షేర్ చేసుకున్నారు. సోషల్ మీడియాల్లో స్వీట్ మెమరీస్ ని గుర్తు చేసుకుంటూ ఫోటోల్ని షేర్ చేశారు. మహేష్ తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోకి “హ్యాపీ 15 మై లవ్ !! ప్రతిరోజూ కంటే కొంచెం ఎక్కువగానే నిన్ను ప్రేమిస్తున్నాను“ అనే అందమైన క్యాప్షన్ ని ఇచ్చారు.
నమ్రత సైతం సోషల్ మీడియాలో తన సంతోషాన్ని వ్యక్తం చేసారు. “ఏ అమ్మాయి అయినా కలలు కనే పరిపూర్ణమైన జీవితాన్ని మీరు నాకు ఇచ్చారు … అపరిమితమైన ప్రేమైక జీవితం.. ఇద్దరు సున్నిత మనస్కులైన పిల్లలు … గర్వంగా చెప్పుకునే ఇల్లు.. అన్నిటికీ మించిన నిధి నీవు! సంతోషంగా ఉంది. పదిహేనవ MB లవ్.. ఇంకేమి అడగగలను?“ అంటూ నమ్రత కాస్త పోయెటిక్ గానే ప్రతిస్పందించారు. ఐదేళ్ల ప్రేమాయణం అనంతరం 2005లో ఆ ఇద్దరూ పెళ్లి బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. గౌతమ్ – సితార ప్రస్తుతం స్కూల్ ఏజ్ కి ఎదిగేశారు. ఇక మహేష్ నటించిన `సరిలేరు నీకెవ్వరు` సక్సెస్ తో మహేష్ హ్యీపీగానే ఉన్నారు. ఇటీవలే అమెరికా నుంచి తిరిగి వచ్చి వంశీ పైడిపల్లి చిత్రం కోసం ప్రిపేరవుతున్న సంగతి తెలిసిందే.
https://twitter.com/urstrulyMahesh/status/1226695127202058241