మెగాస్టార్ చిరంజీవి.. తన కెరీర్ స్టార్టింగ్ లోనే వివాహ బంధంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. స్టార్ కమెడియన్ అల్లు రామలింగయ్య కుమార్తె, అల్లు అరవింద్ సిస్టర్ సురేఖతో ఏడడుగులు నడిచారు. 1980లో చిరు, సురేఖ వివాహం ఘనంగా జరగ్గా.. నాలుగు దశాబ్దాల నుంచి తమ దాంపత్య జీవితాన్ని ఎంతో అన్యోన్యంగా గడుపుతున్నారు.
నేడు (ఫిబ్రవరి 20వ తేదీన) తమ 45వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు చిరంజీవి, సురేఖ. దీంతో వారికి పలువురు సెలబ్రిటీలు, అనేక మంది అభిమానులు బెస్ట్ విషెస్ చెబుతున్నారు. హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఆ పోస్టులే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
అయితే తాజాగా చిరంజీవి స్పెషల్ పోస్ట్ పెట్టారు. ఫ్లైట్ లో తమ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ జరుపుకున్న పిక్స్ ను షేర్ చేశారు. అందులో చిరు దంపతులతో పాటు నాగార్జున, అమల దంపతులు ఉన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
దీంతో మెగా, అక్కినేని, ఘట్టమనేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. పిక్స్ అదిరిపోయాయని చెబుతున్నారు. వాటిని రీ షేర్ చేస్తున్నారు. ఐ ఫీస్ట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే వారంతా కలిసి ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు దుబాయ్ కు స్పెషల్ ఫ్లైట్ లో వెళ్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
అదే సమయంలో చిరంజీవి పోస్ట్ కూడా వైరల్ గా మారింది. “దుబాయ్ కు వెళ్తున్న కొంత మంది ప్రియమైన స్నేహితులతో విమానంలో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నాం. సురేఖను కలల జీవిత భాగస్వామిని కనుగొన్నందుకు నేను ఎల్లప్పుడూ చాలా అదృష్టవంతుడిని అని భావిస్తున్నాను” అని తెలిపారు చిరు.
“ఆమె నా బలం, నా యాంకర్.. ప్రపంచంలోని అద్భుతమైన తెలియని వాటి గుండా నావిగేట్ చేయడానికి ఎల్లప్పుడూ నాకు సహాయపడుతుంది. ఆమె ఉనికి నిరంతరం ఓదార్పునిస్తుంది. అద్భుతమైన ప్రేరణ ఇస్తుంది. ఆమె నాకు ఎంత ముఖ్యమో వ్యక్తపరచడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాను. థాంక్యూ మై సోల్ మేట్.. సురేఖ.. మీ పట్ల నా ప్రేమను వ్యక్తపరచడానికి ఇలాంటి మరిన్ని సందర్భాలు ఉన్నాయి” అంటూ రాసుకొచ్చారు చిరు.