‘సాహో’ నిర్మాత నిర్ణయం, యుఎస్ లో 10 కోట్లు నష్టం

 యుఎస్ లో 10 కోట్లు నష్టం,గోలెత్తుతున్న డిస్ట్రిబ్యూటర్స్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బ‌డ్జెట్ తో హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జీతో తెరెకెక్కిన్న చిత్రం ‘సాహో’. అగ‌ష్టు 30న ఈ సినిమాను ప్రపంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు. ప్రి రీలిజ్ బిజినెస్ సైతం అదే స్దాయిలో జరిగింది. ఈ సినిమా కోసం ప్రస్తుతం చిత్రం టీమ్ భారీ ఎత్తున ప్రమోషన్స్‌ ను నిర్వహిస్తోంది. ఈ నేపధ్యంలో ఈ సినిమా పై వచ్చిన ప్రతీ వార్త విశేషంగా మారుతోంది. తాజాగా ఈ సినిమా గురించిన ఓ వార్త ట్రేడ్ సర్కిల్స్ లో షాకింగ్ మారింది.

అదేమిటంటే…ఈ సినిమా యుఎస్ లో ఓ రోజు ముందుగానే రిలీజ్ అవుతుంది. అంటే ఈ సినిమా ప్రీమియర్స్ పడతాయి. ప్రభాస్ కు బాహుబలి తర్వాత భారీ మార్కెట్ యుఎస్ లో ఏర్పడింది. దాంతో ఆ క్రేజ్ ని ఖచ్చితంగా ప్రీమియర్స్ క్యాష్ చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. డిస్ట్రిబ్యూటర్స్ ఆ మేరకు ప్లానింగ్ చేసుకున్నారు. దాదాపు పది కోట్లు దాకా లాభం వస్తుందని అంచనా వేసారు. అయితే ఇప్పుడు నిర్మాతలు తీసుకున్న ఓ నిర్ణయం వల్ల సీన్ రివర్స్ అయ్యింది.

బయిటకు రాని కొన్ని కారణాలు వల్ల సాహో నిర్మాతలు ..యుఎస్ ప్రీమియర్ షోలు కాన్సిల్ చేసారు. అసలైన కారణం ఏమిటన్నది తెలియదు. కానీ టాక్ హిట్ అయినా మరేదైనా ముందే స్ర్పెడ్ అవటం ఇష్టం లేక ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటున్నారు. అంతవరకూ బాగానే ఉంది కానీ కోట్లు ఖర్చు పెట్టి రైట్స్ తీసుకున్న యుఎస్ డిస్ట్రిబ్యూటర్స్ ..ఇలా నిర్మాతలు తీసుకున్న నిర్ణయంతో డైలమోలో పడ్డారు. దాంతో వాళ్లు నిర్మాతపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. అయితే ప్రభాస్ స్వయంగా ప్రిమియర్స్ వద్దన్నారని చెప్పి, దానికి కాంపన్సేట్ చేద్దామని చెప్పినట్లు సమాచారం.