హాట్ యాంక‌ర్‌కి మెగా ఆఫ‌ర్‌!

హాట్ యాంక‌ర్ రంగ‌మ్మ‌త్త అన‌సూయ‌కు మ‌రో మెగా ఆఫ‌ర్ త‌గిలిన‌ట్టు తెలిసింది. `రంగ‌స్థ‌లం`లో రంగ‌మ్మ‌త్త‌గా గోల్డెన్ ఛాన్స్ కొట్టేసి ఓ ద‌శ‌లో రామ్‌చ‌ర‌ణ్‌నే డామినేట్ చేసిన అన‌సూయ‌కు ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిత్రంలో న‌టించే మెగా ఆఫ‌ర్ ద‌క్కిన‌ట్టు తెలిసింది. చిరంజీవి హీరోగా కొర‌టాల శివ `ఆచార్య‌` పేరుతో ఓ భారీ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే.

ఇప్ప‌టికే దాదాపు యాభై శాతానికి మించి పూర్తయిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా త్రిష త‌ప్పుకోవ‌డంతో ఆ స్థానంలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌ని ఫైన‌ల్ చేశారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి త‌గ్గి ప‌రిస్థితులు మారితే త్వ‌ర‌లోనే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించ‌నున్నారు. సెట్‌లో కాజ‌ల్ ఎంట‌ర్ అవుతుందట‌. ఇదిలా వుంటే ఈ సినిమా కోసం రెజీనా, చిరు పాల్గొన‌గా ఓ స్పెష‌ల్ సాంగ్‌ని ఇదివ‌ర‌కే షూట్ చేశారు. మ‌రో పాట‌ని కూడా షూట్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. ఇందులో అన‌సూయ నటించ‌నున్న‌ట్టు తెలిసింది. ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ కీల‌క అతిథి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఆయ‌నది మాజీ న‌క్స‌లైట్ పాత్ర అని తెలిసింది.