సెప్టెంబర్ నుండి కొరటాల-చిరు సినిమా

కొరటాల శివ గురించి చెప్పడం కంటే ఆయన సినిమాలే ఎక్కువ చెబుతాయి. దాదాపు ప్రతీ స్టార్ హీరో ఆయనతో పని చేయాలి అనుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరుతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం లాంఛనంగా త్వరలోనే ప్రారంభం అవుతుంది. కానీ రెగ్యులర్ షూట్ మాత్రం సెప్టెంబర్ నుండి మొదలవుతుంది. ఈ సినిమా కోసం చిరు మరి కాస్త సన్నబడనున్నారట. ఈ సినిమాను కేవలం ఆరు నెలల్లో పూర్తి చేసి ఏప్రిల్ 10 విడుదల తేదీ కింద అప్పుడే ప్రకటించేశారు కూడా.