అతి తక్కువ మంది కంటెస్టెంట్లతో ప్రసారం కానున్న బిగ్ బాస్ 6.. కారణం అదేనా?

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే బిగ్ బాస్ సీజన్ 6 త్వరలోనే ప్రారంభం కానుంది.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని త్వరలోనే ఈ కార్యక్రమం ప్రసారం కాబోతుందని తెలుస్తోంది. ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో త్వరలోనే ఈ కార్యక్రమం ప్రసారం కాబోతుందని అర్థమవుతుంది. ఇకపోతే ఈ కార్యక్రమం సెప్టెంబర్ 4వ తేదీ ప్రసారం కానున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.ఇదిలా ఉండగా మునుపటిలాగా కాకుండా ఈసారి బిగ్ బాస్ నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని పక్కా ప్రణాళికలతో ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది.

గత సీజన్లలో మాదిరిగా ఈ సీజన్లో ఎక్కువ మంది కంటెస్టెంట్ లో పాల్గొనకుండా కేవలం తక్కువ సంఖ్యలో కంటెస్టెంట్లను ఎంపిక చేసి ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సీజన్ కేవలం 12 లేదా 13 మంది కంటెస్టెంట్లతో నిర్వహించాలని ప్లాన్ చేశారని సమాచారం.అయితే గతంలో ఎక్కువ మంది కంటెస్టెంట్లను తీసుకోవడం వల్ల కంటెస్టెంట్ల మధ్య పెద్ద ఎత్తున వివాదాలు ఏర్పడటమే కాకుండా ఈ కార్యక్రమం పై ఎంతోమంది తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ విషయాలను గుర్తు పెట్టుకొని ఈసారి ఎలాంటి విమర్శలకు తావు లేకుండా నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని పక్క ప్రణాళికలతో ఏర్పాటు చేసినట్లు సమాచారం.ఇక ఈ కార్యక్రమం సెప్టెంబర్ నాలుగవ తేదీ ప్రసారం కానుందని తెలియడంతో ఆగస్టు చివరి వారంలో కంటెస్టెంట్స్ ను క్వారంటైన్ పంపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే గత సీజన్లో మాదిరిగానే ఈ సీజన్ కి కూడా నాగార్జున వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ పెద్ద ఎత్తున కొందరి పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.