`షోలే` ప్రీమియ‌ర్ షో తెర‌వెనుక క‌థ‌!

`షోలే` ప్రీమియ‌ర్ షో తెర‌వెనుక క‌థ‌!

`షోలే`.. 70వ ద‌శ‌కంలో యావ‌త్ భార‌తాన్ని ఉర్రూత‌లూగించిన చిత్రమిది. ఇండియ‌న్ తెర‌పై వ‌చ్చిన తొలి 70 ఎం.ఎం స్టీరియో చిత్రం. ఇద్ద‌రు సూప‌ర్‌స్టార్‌లు క‌లిసి క‌లిసి న‌టించిన ఎవ‌ర్‌గ్రీన్ మ‌ల్టీస్టార‌ర్‌. దీన్ని బ్రేక్ చేసిన చిత్రం ఇన్నేళ్ల సినీ చ‌రిత్ర‌లో ఏదీ రాలేదు.. రాదేమో. ఇప్ప‌టికీ ఈ సినిమా టీవీల్లో వ‌స్తోంద‌టే చిన్న పిల్లాల్లా టీవీల‌కు అతుక్కుపోయే వారు వుండ‌టంటే అతిశ‌యోక్తి కాదేమో.

అమితాబ్ బ‌చ్చ‌న్‌, ధ‌ర్మేంద్ర హీరోలుగా న‌టించిన ఈ చిత్రం భార‌తీయ సినీ య‌వ‌నిక‌పై సువ‌ర్ణాక్ష‌రాల‌తో స‌రికొత్త చ‌రిత్ర‌ని సృష్టించింది. 1975 ఆగ‌స్టు 15న విడుద‌లైన ఈ సినిమా భాష తెలియ‌క‌పోయినా.. అర్థం కాక‌పోయినా ఈ చిత్రాన్ని క్రేజీగా చూసిన వాళ్లెంద‌రో. ఏ దోసితీ.. బ‌సంతీ, గ‌బ్బ‌ర్‌సింగ్ వంటి పేర్లు ఇప్ప‌టికీ వినిపిస్తూనే వున్నాయి. దేశ వ్యాప్తంగా సినీ ప్రియుల మృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసిన ఈ సినిమా ప్రీమియ‌ర్ షో రోజు జ‌రిగిన ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న‌ని అమితాబ్ బ‌చ్చ‌న్ సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు.

ప్రీమియ‌ర్ షో సంద‌ర్భంగా తీసుకున్న ఓ ఫొటోని షేర్ చేసిన అమితాబ్ బ‌చ్చ‌న్ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల్ని వెల్ల‌డించారు. అది 1975 ఆగ‌స్టు 15 `షో`లే ప్రీమియ‌ర్ షోని మిన‌ర్వా థియేట‌ర్‌లో ఏర్పాటు చేశాం. మా, బాబుజీ, జయ మ‌రి కొంత మంది ఉన్నారు. అక్క‌డ జ‌య ఎంత అందంగా క‌నిపిస్తుందో.. .. అయితే ప్రీమియ‌ర్ కోసం 35 ఎం.ఎం ప్రింట్ తీసుకొచ్చాం. 70 ఎంఎం స్టీరియో ప్రింట్ క‌స్ట‌మ్స్ వారి వ‌ద్ద చిక్కుకుంద‌ని తెలిసింది. ఆ కార‌ణంగా ప్రింట్ థియేట‌ర్‌కు అర్థ‌రాత్రి దాటిన త‌రువాత చేరింది. ముందు ప్రింట్ క‌స్ట‌మ్స్ వారి వ‌ద్ద లేద‌ని వార్త‌లు వ‌చ్చాయి. మేము ఆ ప్రింట్‌ను మిన‌ర్వాకు తీసుకుర‌మ్మ‌ని ర‌మేష్ గారికి చెప్పాం. అలా ప్రింట్ థియేట‌ర్‌కు చేరింది. `షోలే` 70 ఎంఎం స్టీరియోలో రూపొందిన తొలి భార‌తీయ చిత్రం. ఈ చిత్రాన్ని నేను. వినోద్‌ఖ‌న్నా బాల్క‌నీలో కూర్చునితెల్ల‌వారు జామున 3 గంట‌ల వ‌ర‌కు ఈ అద్భుతాన్ని చూశాం. అని బిగ్‌బి ఆనాటి సంగ‌తుల్ని గుర్తుచేసుకున్నారు.