శ్రీ‌ముఖి ఎవ‌రితో డేటింగ్ చేస్తోంది?

 యాంక‌ర్ కి డెయిలీ ఆ పాడు అల‌వాటు ఉంద‌ట‌!

బుల్లితెర హాట్ యాంక‌ర్ శ్రీ‌ముఖి ల‌వ్‌లో ప‌డిందా?… ప్ర‌స్తుతం డేటింగ్ చేస్తోందా? అంటే అది నిజ‌మేన‌ని తెలిసింది. ఇంత‌కీ ఎవ‌రా అదృష్ట‌వంతుడు?. ఎక్క‌డుంటాడు? ఏపీనా, తెంల‌గాణ‌నా? యుఎస్‌లో వుంటాడా? అని ఆరాతీస్తే ప‌క్కా హైద‌రాబాదీ అని తెలిసింది. ఈ విష‌యాన్ని రాముల‌మ్మ తానే స్వ‌యంగా త‌న స‌న్నిహితుల వ‌ద్ద వెల్ల‌డించిన‌ట్టు తెలిసింది. అల్లు అర్జున్ న‌టించిన `జులాయి` సినిమాతో కెరీర్ ప్రారంభించిన శ్రీ‌ముఖి `అదుర్స్‌` షోతో లైమ్ లైట్‌లోకి వ‌చ్చేసింది. ఆ త‌రువాత ప‌టాస్ టు స్టార్ మ్యూజిక్ రీలోడెడ్ వ‌ర‌కు మొత్తం 13 షోల‌కు హోస్ట్‌గా వ్య‌వహ‌రించింది.

సినిమాల్లో న‌టించినా రాని గుర్తింపు బుల్లితెర‌పై రావ‌డంతో టీవీ షోల్లోనే కంటిన్యూ అవుతూ వ‌చ్చింది. 7 ఏళ్ల కెరీర్‌లో యాంక‌ర్‌గా పీక్ స్టేజ్‌కి చేరుకుంది. న్యూ ఇయ‌ర్ లో త‌న హాట్ ఫొటోల‌తో షాకిచ్చిన ఈ 26 ఏళ్ల హాటీ బుల్లి తెర‌పై అత్య‌ధిక పారితోషికం తీసుకుంటున్నయాంకర్‌గా రికార్డుని సాధించింది. `బిగ్‌బాస్ 3`లో ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన‌ రాముల‌మ్మ ఇటీవ‌ల‌ హాట్ అవ‌తారం ఎత్త‌డంతో అంతా అవాక్క‌య్య‌రు. శ్రీ‌ముఖి మ‌ళ్లీ సినిమాల్లో ట్రైచేస్తోందా? అని అంతా భావించారు. కానీ తాను సినిమాల్లో న‌టించాల‌నుకోవ‌డం లేదని, త‌ను ప్రేమ‌లో ప‌డింద‌ని, అత‌ను హైద‌రాబాదీ అని తెలిసింది. అయితే అత‌ను ఎవ‌ర‌న్న‌ది మాత్రం స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు స్వ‌యంగా తానే వెల్ల‌డిస్తాన‌ని శ్రీ‌ముఖి తెలిపిన‌ట్టు తెలిసింది.