మిస్టర్ అండ్ మిసెస్ జడ్జిగా అనిల్ రావిపూడి.. హీరో రేంజ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్?

ఇప్పటికే తెలుగు బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారమవుతు పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి అయితే తాజాగా నేటి నుంచి మరొక కార్యక్రమం బుల్లితెర ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమైంది. ఈటీవీలో జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్ నుంచి ప్రేక్షకులను సందడి చేయడానికి వస్తున్నారు.మిస్టర్ అండ్ మిసెస్ అనే కార్యక్రమాల ద్వారా పదిమంది జంటలను ఆహ్వానించి వారికి వివిధ టాస్కులను నిర్వహిస్తూ ఫైనల్ గెలిచిన వారికి భారీ ప్రైజ్ మనీ ఇచ్చేలా ఈ షో ప్లాన్ చేశారు.

ఇక ఈ కార్యక్రమానికి శ్రీముఖి వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారు ఇకపోతే ఎప్పుడూ లేనివిధంగా ఈ కార్యక్రమానికి స్నేహ అనిల్ రావిపూడి శివ బాలాజీ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో అనిల్ రావిపూడి హీరోకి ఏమాత్రం తగ్గకుండా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. లైఫ్ అంటే మినిమమ్ ఇట్టా ఉండాలి అంటూ పాటకు డాన్స్ చేస్తూ వేదిక పైకి వచ్చారు.

ఇక అనిల్ రావిపూడి వేదిక పైకి రాగానే శ్రీముఖి తనదైన స్టైల్ లో తనపై ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబట్టారు అదేవిధంగా అనిల్ రావిపూడి కూడా మాట్లాడుతూ తాను ఎఫ్2 ఎఫ్3 సినిమాల ద్వారా ఫ్రస్టేషన్ నుంచి బయటపడటానికి మగ వాళ్లకు ఒక ఆసనం ఇచ్చానని కంప్లైంట్ నాపై ఉంది అయితేఎపిసోడ్ పూర్తి అయ్యేలోపు ఆడవాళ్లకు కూడా ఫ్రస్టేషన్ నుంచి బయటపడే ఆసనం ఇస్తానని ఈయన చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇకపోతే జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్ నుంచి ఇప్పటికే వచ్చిన ఎన్నో కార్యక్రమాలు పెద్ద ఎత్తున బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరి ఈ కార్యక్రమం ఎలా ఆకట్టు కుంటుంది వేచి చూడాలి.