ఎప్పుడూ వివాదాల్లో నిలిచే సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం `అమ్మరాజ్యంలో కమ్మబిడ్డలు`. ఈ చిత్రం ప్రస్తుత ఏపీ రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించిన చిత్రమిది. ఈ చిత్రం విడుదల తర్వాత చాలా మంది ప్రతిపక్ష నాయకుల మనోభావాలను దెబ్బతీసినట్లు పలువురు నాయకులు భావిస్తున్నారు. వివాదాస్పదంగా సెటైరికల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ముందు విడుదలకు చాలా ఇబ్బంది పడ్డాడు వర్మ.
ఇక ఇదిలా ఉంటే… వర్మకు పెద కర్మ నిర్వహించారు జనసైనికులు. వర్మకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ‘జోహార్ ది బాస్టర్డ్’ అంటూ ఆయన పై ఉన్న ఉక్రోషాన్ని కోడూరు పాడు జనసేన యూత్ ఒక బ్యానర్ కట్టి ఈ విధంగా చూపించారు. వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ (అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు) మూవీ డిసెంబర్ 12న విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను నెగిటివ్‌గా చూపించడంతో జనసైనికులు ఫైర్ అవుతున్నారు.
తమ నాయకుడ్ని పోలిన వ్యక్తి క్యారెక్టర్‌తో తమను అవమానించారని దీనికి నిరసనగా వర్మను సోషల్ మీడియాలో ఏకిపారేస్తూ బండబూతులు తిడుతున్నారు జనసైనికులు. అంతటితో ఆగకుండా.. కోడూరుపాడు జనసేన యూత్ సభ్యులు వర్మకు ఏకంగా పెద కర్మ ఫ్లెక్సీలను కట్టి మరి పెదకర్మను చేసేశారు.
ఆ చిత్రం ఏ రోజైతే విడుదలైందో అనగా డిసెంబర్12న ఆరోజు వర్మ చనిపోయిన్టలు పెట్టారు. డిసెంబర్ 26న ఆయన పెద కర్మ అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ‘నీ ఆకస్మిక మరణం మాకు తీరని లోటు కలిగించాలని నీ ఆత్మకు ఎట్టి పరిస్థితుల్లో శాంతి చేకూరకూడదని భగవంతున్ని ప్రార్ధిస్తూ జనసేన యూత్- కోడూరు పాడు’ అంటూ భారీ ఫ్లెక్సీను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జోహార్ బాస్టర్డ్ అంటూ వర్మను ఏకిపారేస్తున్నారు జనసైనికులు.