వర్మ “వ్యూహం” కి కూడా సీక్వెల్..పైగా రిలీజ్ డేట్స్ కూడా లాక్ 

టాలీవుడ్ సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఓ సాలిడ్ బ్రాండ్ కానీ ఇపుడు బి గ్రేడ్ సినిమాలు కన్నా హీనమైన సినిమాలు చేసే పరిస్థితికి తాను దిగజారిపోయాడు. అయితే ఈ సమయంలో కూడా వర్మ తన మార్క్ ని మాత్రం వదలట్లేదు అని ఇంకా ఫాలో అయ్యేవారు కూడా ఉన్నారు.

కాగా రామ్ గోపాల్ వర్మ అయితే ఇప్పుడు పాలిటిక్స్ పరంగా పలు సినిమాలు చేస్తున్నాడు. గత ఎన్నికల సమయంలో కొన్ని చిత్రాలు అలాగే ఈ రానున్న ఎన్నికలకి గాను మరో సినిమాని వర్మ సిద్ధం చేస్తున్నాడు. అయితే మెయిన్ గా ఏపీ రాజకీయాలపైనే వర్మ ఇప్పుడు సినిమాలు చేస్తున్నాడు.

కాగా అలా ఇపుడు వై ఎస్ జగన్ పై చేస్తున్న తాజా చిత్రమే “వ్యూహం”. ట్రైలర్ తోనే మంచి ఆసక్తి రేపిన వర్మ ఈ చిత్రం కి ఇప్పుడు సీక్వెల్ దానికి రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసాడు. కాగా మొదట వ్యూహం పార్ట్ 1 కి ఈ నవంబర్ 10 డేట్ ని లాక్ చేయగా వ్యూహం పార్ట్ 2 ని మాత్రం మరో టైటిల్ “శపథం” వ్యూహం 2 అంటూ లాక్ చేసాడు.

కాగా దీనిని అయితే వచ్చే ఏడాది జనవరి 25న థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపాడు. పైగా రెండిటికి కూడా రెండు ఇంట్రెస్టింగ్ పోస్టర్ లతో రివీల్ చేయగా పక్కాగా వచ్చే ఎన్నికల మీదనే ఈ సినిమాలు ప్రభావం చూపేలా ప్లాన్ చేస్తున్నారని అనిపిస్తుంది. మరి ఈ సినిమాలు పేలుతాయో లేక మొదట హైప్ వచ్చి లాస్ట్ లో మేటర్ లేకుండా మిగిలిపోతాయో చూడాలి.