వక్కంతం వంశీ చాలా సినిమాలకు పనిచేశాడు. రచయితగా మంచి విజయాల్ని తన ఖాతాలో వేసుకున్నాడు. దర్శకులకు హిట్‌లిచ్చే కథల్ని అందించాడు. కలుసుకోవాలని, అశోక్, అతిథి, కిక్, కల్యాణ్‌రామ్ కత్తి, ఊసరవెల్లి, ఎవడు, రేసుగుర్రం, టెంపర్ వరకు వంశీ కథ అందించిన సినిమాల్లో దాదాపు హిట్‌లే. ఆ తరువాతే అతని ఫేట్ మారింది. వరుస ఫ్లాపులొచ్చాయి.
దర్శకుడిగా చేసిన తొలి సినిమా `నా పేరు సూర్య` అల్లు అర్జున్ కెరీర్‌లోనే డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా తరువాత అతనికి మరో సినిమా ఇవ్వడానికి హీరోలు ఎవరూ ఆసక్తిని చూపించలేదు. కానీ రవితేజ మాత్రం ముందుకొచ్చాడు. అయితే అతని పరిస్థితీ ఇంచుమించు ఇలాగే వుంది. అయినా వక్కంతం వంశీకి అవకాశం ఇచ్చాడు రవితేజ. మరి వక్కంతం ఈసారైనా మెప్పిస్తాడా? అన్నది అతని చేతుల్లోనే వుంది. ఈ దఫా ఆకట్టుకోలేకపోతే వక్కంతం వంశీకి మరో అవకాశం దక్కడం కల్లే.