వెబ్ సిరీస్ లో సందీప్ కిషన్

ఇప్పుడు డిజిటల్ మాధ్యమాల విలువేమిటో గుర్తిస్తున్నారు సినీ తారలు. క్రమంగా ఒక్కొక్కరు వెబ్ సిరీస్ లో పని చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ప్రియాంక చోప్రా దగ్గర నుండి తేజస్వి మడివాడ, నిత్యా మీనన్, ప్రియా మణి దాకా చాలా మంది ఈ వెబ్ సిరీస్ లకు సంతకం చేశారు. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్ లకు పెరుగుతన్న ఆదరణే ఇందుకు కారణమని చెప్పొచ్చు. ఈ క్రమంలో మరో యువ హీరో ఈ జాబితాలో చేరిపోయాడు. అతనే సందీప్ కిషన్.

ఇతను అమెజాన్ ప్రైమ్ లో ఒక ‘ది ఫామిలీ మాన్’ అనే వెబ్ సిరీస్ లో ఒక మేజర్ పాత్రలో నటిస్తున్నాడు. ఆ పాత్ర పేరు విక్రమ్ వైద్. ఈ సిరీస్ లో ఇంకా ప్రియమణి, మనోజ్ బాజ్పాయ్ వంటి వారున్నారు. ఈ వెబ్ సిరీస్ ను రాజ్ నిడిమోరు మరియు కృష్ణ డీ.కె దర్శకత్వం చేస్తున్నారు. ఈ సిరీస్ సెప్టెంబర్ 20 నుండి అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం కానుంది.