కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ డార్లింగ్ హీరో ప్రభాస్ మరోసారి బాహుబలి అని నిరూపించుకున్నాడు. ప్రకృతి విపత్తుల సమయంలో సినీ ఇండస్ట్రీ వర్గాలు బూరి విరాళాలు ప్రకటిస్తుంటారు. అవి అత్యధిక శాతం లక్షల్లో మాత్రమే వుంటుంటాయి. ప్రస్తుంతం జరుగుతున్నది విపత్తు కాదు వినాశనం కాబట్టి ఒక్కొక్కరు కోట్లు ఖర్చు చేయడానికి వెనకాడటం లేదు.
ఈ రోజు ఉదయం నుంచి విరాళాల రూపంలో కోట్ల వర్షం కురుస్తోంది. కరోనా మహమ్మారిని కట్టడి చేయడం కోసం సినీ ఇండస్ట్రీ మేము సైతం అంటూ ముందుకొచ్చింది. నితిన్ నుంచి విరాళాల పరంపర మొదలైంది. నితిన్ 20 లక్షలు ప్రకటిస్తే.. పవన్‌కల్యాణ్ పీఎం సహాయ నిధికి కోటి, ఉభయ తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయ నిధికి కోటి ప్రకటించాడు. ఆ తరువాత రామ్‌చరణ్ 70 లక్షలు, ఎన్టీఆర్ 75 లక్షలు ప్రకటించారు. చిరు మాత్రం కోటి ప్రకటించినా అది సినీ కార్మికులకే అన్నారు. తాజాగా బాహుబలి ప్రభాస్ ఏకంగా 4 కోట్లు ప్రకటించాడు. ఇందులో పీఎం సహాయ నిధికి 3 కోట్లు, ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెరో 50 కోట్లు ప్రకటించి విరాళం ప్రకటించడంలోనూ బాహుబలి బాహుబలే అనిపించుకున్నాడు.