విదేశాల్లో చాణక్య పాటల చిత్రీకరణ

గోపీచంద్ హీరోగా రూపొందుతోన్న చిత్రం చాణక్య‌. తిరు ద‌ర్శ‌క‌త్వంలో ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్ర‌స్తుతం పాట‌ల చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ రాజు సుంద‌రం నేతృత్వాన‌ ఇట‌లీ, మిలాన్‌లో పాట‌ల‌ను చిత్రీక‌రిస్తున్నారు.

ఈ పాట‌ల చిత్రీక‌ర‌ణ షూటింగ్ విశేషాల‌ను అక్క‌డి లోక‌ల్ ఎల‌క్ట్రానిక్ మీడియా ప్రత్యేకంగా ప్రసారం చేయ‌డం విశేషం. మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ
చిత్రానికి వెట్రి కెమెరామెన్‌.