జీవిత భాగస్వామిని ఎంచుకునే సమయంలో ఈ పొరపాట్లు చేస్తున్నారా!

Chanakya Niti: వివాహం అనేది ప్రతి ఒక్కరి విషయంలో ఎంతో ముఖ్యమైన వేడుక. ఈ క్రమంలోనే ఈ వివాహ సమయంలో అబ్బాయి అమ్మాయి గురించి మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యుల గురించి ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతే సంబంధం కలుపుకోవాలని పెద్దలు చెబుతుంటారు. ఈ క్రమంలోనే వివాహం చేసుకునే సమయంలో వధూవరులు తప్పనిసరిగా కొన్ని విషయాలు తెలుసుకోవాలని చాణిక్యుడు తన నీతి గ్రంథం ద్వారా తెలియజేశారు.

మరి చాణిక్య నీతి కథ ప్రకారం వివాహం చేసుకునే వారు తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయాలు ఏమిటి అనే విషయానికి వస్తే… వివాహం తర్వాత వధూవరుల జీవితం పదికాలాలపాటు సంతోషంగా సాగిపోవాలంటే తప్పనిసరిగా ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.రోగంతో బాధపడే అమ్మాయిని పెళ్లి చేసుకున్న తప్పు లేదు కానీ సహనం లేని అమ్మాయి లేదా అబ్బాయిని పెళ్ళి చేసుకోకూడదని చాణిక్యుడు వెల్లడించారు. అలాగే నిత్యం చిరునవ్వులు చిందిస్తూ మధురమైన మాటలు మాట్లాడే వారిని పెళ్లి చేసుకోవాలి. అలా కాకుండా కఠినమైన స్వభావం ఉండి, మాటలు అసభ్యంగా మాట్లాడుతూ, ఎప్పుడూ కోపంతో ఉండే వారిని పెళ్లి చేసుకోకూడదు.

ఇక మనం పెళ్ళి చేసుకోబోయే వారు మతపరమైన ఆచారాలను తెలిసి ఉన్న వ్యక్తి అయితే వారి జీవితం ఎంతో సంతోషంగా ఉంటుందని చాణిక్యుడు వెల్లడించారు. విధమైనటువంటి విషయాలను గుర్తు పెట్టుకొని మనం పెళ్లి చేసుకోబోయే వారిని ఎంపిక చేసుకోవాలి. ఈ విధమైనటువంటి లక్షణాలు ఉన్న జీవిత భాగస్వామి దొరికితే వారి జీవితం పదికాలాలపాటు ఎంతో సంతోషంగా ఉంది.