రౌడీ హీరో ప్రామిస్ నిల‌బెట్టుకుంటాడా?

టాలీవుడ్ హీరోలు ఎలా స్పందించినా.. రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ అప్రోచ్ .. స్పందించే తీరు కొంచెం భిన్నంగానే వుంటుంది. ఈ విష‌యం అత‌న్ని గ‌మ‌నించే ప్ర‌తీ అభిమానికీ తెలుసు. ప్ర‌కృతి వైప‌రిత్యాలు సంభ‌వించిన‌ప్పుడు టాలీవుడ్ ఇండ‌స్ట్రీ నుంచి ఈ మ‌ధ్య కాలంలో ముందుగా స్పందించిన తొలి హీరో విజ‌య్ దేర‌కొండ‌. అయితే క‌రోనా విష‌యంలోనూ అత‌నే ముందుగా స్పందిస్తాడ‌ని, విరాళం ప్ర‌క‌టిస్తాడ‌ని అంతా భావించారు కానీ విజ‌య్ నుంచి ఎలాంటి స్పంద‌న లేదు.

దీంతో విజ‌య్ ఏంటీ ఇలా సైలెంట్ అయిపోయాడ‌ని అంతా ఆశ్చ‌ర్యంతో కామెంట్‌లు చేయ‌డం మొద‌లుపెట్టారు. అయితే లేట్‌గా స్పందించినా త‌ను స్పందించే తీరు భిన్నంగా వుంటుంద‌ని మ‌రోసారి నిరూపించాడు. తాజాగా విధినిర్వ‌హ‌ణ‌లో ముందుంటున్న పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి త‌న సంఘీభావాన్ని తెలియ‌జేసి స్వ‌యంగా వారి ద‌గ్గ‌రికే వెళ్లి వారితో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ఇంట‌రాక్ట్ కావ‌డం ఆక‌ట్టుకుంటోంది.

అయితే ఈ సంద‌ర్భంగా పోలీసులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ స‌మాధానాలు చెప్పాడు. ఇదే స‌మ‌యంలో మిమ్మ‌ల్ని పోలీస్ పాత్ర‌లో చూడాల‌ని వుంద‌ని అడిగిన వారికి రానున్న మూడేళ్ల‌లో పోలీస్ పాత్ర‌లో క‌నిపిస్తాన‌ని ప్రామిస్ చేశాడు. ఆ టైమ్‌లో త‌న ప్రామిస్‌ని నిల‌బెట్టుకుంటాడో లేక మ‌ర్చిపోతాడో చూడాలి.