రేణూ దేశాయ్‌తో విడిపోయిన పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ భరణం కింద ఆమెకు భారీగానే అందించాడని, ఆ మొత్తంతో మరో తరం కూడా హ్యాపీగా జీవితాన్ని లీడ్ చేయొచ్చని ఫిల్మ్ సర్కిల్స్‌లో గత కొంత కాలంగా వార్తలు షికారు చేస్తూనే వున్నాయి. ఇక తాజాగా పవన్‌కల్యాణ్ రెండేళ్ల విరామం తరువాత వరుసగా సినిమాలని అంగీకరిస్తూ అటు ఫ్యాన్స్‌కి, ఇటు ఇండస్ట్రీ వర్గాలకీ షాకిస్తున్నారు. తాజాగా పవన్ తన పిల్లల కోసం 5 కోట్ల రూపాయల విలువ చేసే ఓ విలాసవంతమైన ఫ్లాట్‌ని ఖరీదు చేశాడని, ఇకపై వాళ్లతో పాటు మాజీ భార్య రేణూ దేశాయ్ కూడా అదే ఫ్లాట్‌లో వుండబోతోందని వార్తలు మొదలయ్యాయి.
అయితే ఈ వార్తలపై పవన్ మాజీ భార్య రేణూదేశాయ్ ఘాటుగా స్పందించింది. ఒంటరి మహిళగా తన మనుగడ కోసం శ్రమిస్తున్నానని, ఇప్పటి వరకు తన తండ్రి దగ్గర నుంచి కూడా ఎలాంటి ఆర్ధిక సహాయాన్ని ఆశించలేదని, పొందలేదని, అలాంటిది తన మాజీ భర్త నుంచి ఎందుకు ఆర్థిక సహాయాన్ని పొందుతానని, ఇప్పటి వరకు ఆయన నుంచి అసంబద్ధమైన భరణాన్ని తాను పొందలేదని, హైదరాబాద్‌లో తాను తీసుకున్న ఫ్లాట్‌ని ఎవరూ కొనివ్వలేదని, తన కష్టార్జితంతోనే తీసుకున్నానని, ఈ విషయంలో తన మాజీ భర్తకుఎలాంటి సంబంధం లేదని, ఇలాంటి వార్తల్ని ప్రచారం చేసి తన మాజీ భర్త ఫ్యాన్స్‌కి, తనకీ మధ్య మళ్లీ గొడవలు తీసుకురావద్దని స్పష్టం చేయడం ఆసక్తికరంగా మారింది.