మొదటి సినిమాతో మంచి విజయం సాధించిన దర్శకుడు అజయ్ భూపతి. అతను తీసిన RX 100 చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే. ఆ సినిమా తరువాత కొంత విరామం తీసుకుని ‘మహా సముద్రం’ చేస్తున్నాడు. అయితే ఆ సినిమాలో ముందుగా అనుకున్న హీరో రవి తేజ వెళ్లిపోవడం వల్ల సినిమా కొంత ఆలస్యమైంది. ఇక అంతా సర్దుకుని ఈ సినిమా అక్టోబర్ నుండి చిత్రీకరణ మొదలు కానుంది.
ఈ నేపధ్యంలో అతని మూడో సినిమా కూడా ఖరారు అయింది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వీ. ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే ఈ సినిమా లో కథా నాయకుడి పాత్ర కోసం హీరో రామ్ తో సంప్రదింపులు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. అంతా అనుకున్నది అనుకున్నట్టు జరిగితే అజయ్ భూపతి మూడో సినిమా హీరో రామ్ తో చేయచ్చు. చూద్దాం మరి ఎం జరుగుతుందో.