కొన్నిసార్లు ఒక హీరో నటించాల్సిన సినిమాలో మరో హీరో నటించడంతో పాటు ఆ సినిమాతో సక్సెస్ సాధించిన సందర్భాలు సైతం ఉంటాయి. బన్నీ హీరోగా తెరకెక్కాల్సిన ఒక సినిమాలో రామ్ నటించి సక్సెస్ సాధించారు. వైవీఎస్ చౌదరి డైరెక్షన్ లో తెరకెక్కిన దేవదాసు సినిమాతో బన్నీ హీరోగా కెరీర్ ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా బన్నీ నటించాల్సిన సినిమా కావడం గమనార్హం.
వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా దేవదాస్ సినిమా వెనుక ఆసక్తికర కథ ఉంది. సీతయ్య సక్సెస్ తర్వాత వైవీఎస్ చౌదరి కొత్తవాళ్లతో సినిమా మొదలుపెట్టాలని అనుకున్నారు. బాలరాజు పేరుతో ఈ సినిమా స్క్రిప్ట్ సిద్ధమైంది. వైవీఎస్ చౌదరి సన్నిహితుడు అయిన కొమ్మినేని అల్లు అర్జున్ దేవదాస్ సినిమాలో నటిస్తే బాగుంటుందని సూచించారు. అల్లు అరవింద్ కు దేవదాస్ కథ నచ్చినా బన్నీ ఇతర ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటంతో గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
ఆ తర్వాత స్రవంతి రవికిషోర్ ను వైవీఎస్ చౌదరి కలవగా రామ్ ను పరిచయం చేశారు. యువసేన, ప్రేమిస్తే సినిమాలలో ఛాన్స్ వచ్చినా రామ్ ఆ సినిమాలను వదులుకుని దేవదాస్ సినిమాను మొదలుపెట్టారు. ఆ తర్వాత ఇలియానా ఈ సినిమాకు ఎంపికయ్యారు. చక్రి ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపికయ్యారు. బ్యాంకాక్, యూఎస్ లో ఈ సినిమా షూటింగ్ జరగడం గమనార్హం.
ఆరు కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా నెగిటివ్ టాక్ తో మొదలైన ఈ సినిమా తర్వాత పుంజుకుంది. ఆర్య తర్వాత బన్నీతో దేవదాస్ ను తెరకెక్కించే అవకాశం దక్కినా అప్పటికే రామ్ కు మాట ఇవ్వడంతో వైవీఎస్ చౌదరి ఆ ఆఫర్ ను వదులుకోవాల్సి వచ్చింది. దేవదాస్ కు ముందు ఇదే కాన్సెప్ట్ తో పలు సినిమాలు తెరకెక్కినా ఆ సినిమాలు దేవదాస్ స్థాయిలో కమర్షియల్ గా సక్సెస్ కాలేదు.