రామ్ గోపాల్ వర్మ సమర్పణలో “భైరవ్ గీత ” సినిమా ఈ నెల 30 న విడుదల అవుతుందని వర్మ ప్రకటించాడు . అయితే మంగళవారం నాడు ఈ సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్టు వార్త వెలువడింది . ధనుంజయ్ , ఐరా మోర్ జంటగా సిద్దార్థ దర్శకత్వంలో ఈ చిత్రం నిర్మాణమైంది . ఈ సినిమాకు రామ్ గోపాల్ వర్మ సమర్పకుడు . అయితే భైరవ గీత సినిమాను రజనీకాంత్ , శంకర్ ల ప్రతిష్టాత్మక సినిమా 2. 0 మీద వేస్తున్నట్టు వర్మ ప్రకటించాడు . ఇది ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు . ఎందుకంటే అలా ప్రకటించడం , వివాదాలకు తెర లేపడం వర్మ కు కొత్త కాదు .
అయితే భైరవ గీత చిత్రం విడుదల ఎందుకు ఆగిపోయింది . రజనీకాంత్ , శంకర్ ల సినిమా 2. 0 మీద వేస్తున్నామని ఎంతో గొప్పగా చెప్పిన వర్మ ఇప్పుడు వెనక్కు తగ్గాడంటే అందుకు బలమైన కారణమే ఉండొచ్చు అని అంటున్నారు . దీనిపై మరో వార్త కూడా ఇప్పుడు వినిపిస్తుంది . భైరవ గీత థియేటర్లు లేక విడుదల కావడం లేదని . ఇది నిజం కాకపోవచ్చు . ఎక్కువ థియేటర్లు రజనీకాంత్ సినిమాకు ఇచ్చి ఉండవచ్చు . అంత మాత్రాన ఇక థియేటర్లు లేవని చెప్పడం కరెక్ట్ కాదు .
ట్రేడ్ వర్గాల కథనం వేరేలా వుంది . వర్మ సినిమాకు కావాలనే థియేటర్లు ఇవ్వలేదని . ఎందుకంటే వర్మ నందమూరి కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి “లక్ష్మీస్ ఎన్టీఆర్ “చిత్రం తీస్తున్న సంగతి తెలిసిందే . ఎన్ .టి రామారావు మీద అభిమానం వున్న నిర్మాతలు, దర్శకులు, పంపిణీదారులు , ప్రదర్శకులు ఇప్పటికీ చాలా మంది వున్నారు . భైరవ గీత సినిమాతో వరమా కు శాంపిల్ మాత్రమే చూపారు అంటున్నారు .
అంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు థియేటర్లు ఇవ్వకుండా వర్మను ఇబ్బంది పెట్టె అవకాశం వుంది . సినిమా థియేటర్లు ఎక్కువ భాగం సురేష్ బాబు,దిల్ రాజు ,సునీల్ నారంగ్ కాంట్రొల్ లో ఉన్నాయి . ఈ ముగ్గురు ఒకటైతే థియేటర్లు వుండవు .
సురేష్ బాబుకు వర్మ అంటే పిచ్చి కోపంతో వున్నాడు . తన రెండవ కొడుకు అభిరాం , శ్రీరెడ్డి వ్యవరంలో వర్మ తలదూర్చి తమ కుటుంబ పరువు తీసాడని సురేష్ భావిస్తున్నాడు . అవకాశం కోసం చూస్తున్నాడు . ఇక రానా ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తున్నాడు . సురేష్ బేనర్ మహా నటుడు ఎన్టీరామారావు నటించిన రాముడు భీముడు సినిమాతో మొదలైంది .
వర్మ సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు థియేటర్లు లేకుండా చెయ్యాలని, ఆ సినిమా ఎట్టి పరిస్థితుల్లో విడుదల కానివ్వకూడదని సురేష్ బాబు ప్లాన్ అని దీని వెనుక బాలకృష్ణ , చంద్ర బాబు వున్నారని అంటున్నారు . మరి రామ్ గోపాల్ వర్మ కు ఇది పెద్ద షాకింగ్ న్యూసే ! కిమ్ కర్తవ్యమ్ ?