ఊహించినట్టే రాధేశ్యామ్ (ప్రభాస్ 20) ఫస్ట్ లుక్ చూశాక ఇదో అద్భుతమైన రొమాంటిక్ టేల్ అని అర్థమవుతోంది. డార్లింగ్ ప్రభాస్ ఆహార్యం.. బుట్ట బొమ్మ పూజా హెగ్డే రొమాన్స్ చూస్తుంటే..అరెరే చాలాకాలం తర్వాత ఒక పేదమ్మాయిని ప్రేమించే రిచ్ కుర్రాడి కథను తెరపై చూడబోతున్నామా? అన్న ఉద్వేగం యూత్ కి కలగకుండా ఉండదు.
సాహో లాంటి భారీ యాక్షన్ సినిమాతో సాహసాలు చేసిన ప్రభాస్ కి రాధే శ్యామ్ ఏ మేరకు ఊరటనిస్తుంది? అన్నది అటుంచితే డార్లింగ్ ప్రభాస్ మరోసారి అదిరిపోయే ప్రయోగమే చేస్తున్నాడని తాజా పోస్టర్ చెబుతోంది. ఫస్ట్ లుక్ ఇంప్రెస్సివ్.. క్రియేటివ్ గానూ ఉంది. పైగా అంబాసిడర్ కార్ల కాలంలోని బిజినెస్ మ్యాగ్నెట్ ప్రభాస్ అని సాగించిన ప్రచారం కూడా నిజమేనని పోస్టర్ చెబుతోంది.
నిజానికి చాలా కాలం పాటు జాన్ వర్కింగ్ టైటిల్ గా ఉన్నా.. అనూహ్యంగా రాధేశ్యామ్ గా మార్చారు. అయితే ఇప్పటికే జాన్ టైటిల్ ని బాలీవుడ్ కండల హీరో సల్మాన్ ఖాన్ ఇప్పటికే రిజిస్టర్ చేయించారని తెలిసింది. ఆ క్రమంలోనే రాధే శ్యామ్ ని ఫైనల్ చేశారట.
పోస్టర్ ని పరిశీలిస్తే.. ప్రభాస్ తెల్లటి సూట్ లో ఎంతో అందంగా కనిపిస్తున్నాడు. ప్రేయసి కౌగిలింతలో తరిస్తున్నాడు. పూజా హెగ్డేను చేతులు చుట్టేసి హత్తుకున్నాడు. రాయల్ రెడ్ డిజైన్ లో పూజా ఉత్కంఠభరితంగా కనిపిస్తోంది. రోమ్ నేపథ్యంలో వారిద్దరూ రొమాన్స్ చేస్తున్న దృశ్యమది. పోస్టర్ లో ఉపయోగించిన రెడ్ టోన్ చూస్తుంటే ఇదో గొప్ప ప్రేమకథా ఇతిహాసం అని భావించాల్సి ఉంటుంది. శృంగారాన్ని పీక్స్ చూపిస్తున్నారనే భావించాల్సి ఉంటుంది.
రాధే శ్యామ్ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. హీరోలను మాత్రమే ఫస్ట్ లుక్ పోస్టర్లలో చూపించే కల్చర్ వదిలేసి ఇప్పుడిలా హీరోయిన్ కు సమాన ప్రాముఖ్యత ఇచ్చినందుకు రాధే శ్యామ్ బృందాన్ని ప్రశంసించి తీరాలి. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ – గోపికృష్ణ బ్యానర్లలో వంశీ-ప్రమోద్ -ప్రసాద్ నిర్మిస్తున్నారు. మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకుడు కాగా, కోటగిరి వెంకటేశ్వర్ రావు ఎడిటింగ్ చేస్తున్నారు. 2021 లో సినిమా విడుదల కానుంది. టి-సిరీస్ భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని హిందీలో విడుదల చేయనున్నారు.
Here's Our Darling #Prabhas' #RadheShyam First Look ♥️@hegdepooja @director_radhaa @UV_Creations@TSeries @itsBhushanKumar @AAFilmsIndia #Prabhas20FirstLook pic.twitter.com/uK18QqsGEi
— Prabhas FC (@PrabhasRaju) July 10, 2020