రాజు గారి గది 3 ఫస్ట్ లుక్ విడుదల

వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా రాజుగారి గ‌ది 3 ఫ‌స్ట్ లుక్‌ని వి.వి.వినాయ‌క్ విడుద‌ల చేశారు. ఓంకార్ దర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అశ్విన్‌బాబు, అవికాగోర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ముగిసింది. ప్రస్తుతం డ‌బ్బింగ్‌, నిర్మాణానంతర పనులు జ‌రుగుతున్నాయి. ష‌బీర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఛోటా కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

ద‌ర్శ‌క నిర్మాత ఓంకార్ మాట్లాడుతూ – రాజుగారిగ‌ది` సినిమాను చేసేట‌ప్పుడు ఆ సినిమా గురించి ఎవ‌రికీ పెద్ద‌గా తెలియ‌దు. అప్పుడు వినాయ‌క్ అన్న‌య్య చేతుల మీదుగా వినాయ‌క‌చ‌వితిరోజునే టీజ‌ర్‌ను విడుద‌ల చేశాం. దాని ద‌శ మారిపోయింది బిజినెస్ అయిపోయింది. నాలుగేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడు వినాయ‌క్ అన్న‌య్య చేతుల మీదుగా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌డం ఆనందంగా అనిపించింది.
అన్నీ కుదిరితే ఈ ద‌స‌రాకు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తాం’ అన్నారు.