దర్శకేంద్రడు కె. రాఘవేంద్రరావు కాళ్లు పట్టుకున్నారు డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. అనుష్క కెరీర్ ప్రారంభించి 15 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆమె నటిస్తున్న `నిశ్శబ్దం` టీమ్ 15 ఇయర్స్ సెలబ్రేషన్స్‌ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనుష్కతో కలసి పనిచేన దర్శకులు పాల్గొన్నారు. స్వీటీని అనుష్కగా ఇండస్ట్రీకి `సూపర్` సినిమాతో పరిచయం చేసిన పూరి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు.
మాటల్లో కె. రాఘవేంద్రరావు గురించి వెల్లడిస్తూ తను 15 ఏళ్ల క్రితం అన్న మాటలకి స్టేజ్‌పై రాఘవేంద్రరావు కాళ్లు పట్టుకొని క్షమాపణ కోరడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. నాగార్జున డేట్స్ కోసం రాఘవేంద్రరావు వచ్చినప్పుడు తాను `సూపర్` సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోకి వచ్చానని, ఎందుకు వచ్చారు సార్ అని అడిగితే ఆయన నాగార్జున డేట్స్ కోసమని చెప్పారని, తాను ఐదవ తరగతిలో వుండగా అడవిరాముడు` చిత్రం చూశానని, ఇంకా డేట్స్ ఎందుకు సార్ రిటైర్ అయిపోవచ్చుకదా? అన్నానని. దానికి ఆయన చిన్నగా నవ్వి భుజం తట్టి నాగార్జున డేట్స్ తీసుకుని ఆయనకు `శ్రీరామదాసు`తో సూపర్ హిట్ ఇస్తే తాను తుస్సుమనిపించానని, తన అజ్ఞానానికి చింతిస్తున్నానని వేదికపైనే రాఘవేంద్రరవు కాళ్లు పట్టుకుని పూరి క్షమాపణ కోరాడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది.