రష్మిక మందన్న , రక్షిత్ శెట్టి ల వివాహ నిశితార్థం రద్దయిందని అందరు భావిస్తున్నారు . మీడియా, సోషల్ మీడియా కూడా కోడై కూసింది . అయితే ఈ విషయమై ఈ ఇద్దరు పెదవి విప్పలేదు . బెంగళూరు లో స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం ఉంగరాలు మార్చుకున్నారు రష్మిక , రక్షిత్ . ఇది జరిగిన కొన్నాళ్లకే రష్మిక నటించిన తెలుగు సినిమా “గీత గోవిందం ” విడుదలై సంచలన విజయ
సాధించింది . అంతకు ముందు నాగశౌర్యతో “ఛలో ” అనే చిత్రంలో మొదటిసారి తెలుగులో నటించింది . అయితే ఆ సినిమా పెద్దగా విజయ సాధించలేదు . అయినా రష్మిక గీత గోవిందం నిర్మాత దర్శకులకు నచ్చింది . రష్మిక గీత గోవిందం చిత్రం విడుదల తరువాత రాత్రికి రాత్రే స్టార్ అయ్యిందని చెప్పడానికి నిదర్శనం “దేవదాస్ “సినిమాలో నాగార్జున పక్కన నటించడాని అవకాశం వెతుక్కుంటూ రావడమే. . ఈ స్టార్
డమ్ రష్మిక కు కష్టాలను తెచ్చి పెట్టింది . వ్యక్తిగత జీవితం బజారుకెక్కింది .
“గీత గోవిందం” సినిమాలో విజయ్ దేవర కొండ తో ముద్దు సన్నివేశాలు వున్నాయి . ఆ సినిమా షూటింగ్ లో రష్మిక , విజయ్ దేవరకొండ మధ్యన ఎదో నడిచిందని, ఈ ఇద్దరు ఎంతో సన్నిహితంగా ఉంటున్నట్టు సోషల్ మీడియాలో గాలి వార్తలు కర్ణాటక దాకా వెల్లువెత్తాయి . రక్షిత్ అభిమానులు ఈ వార్తను రచ్చ రచ్చ చేశారు . ఇది రక్షిత్ దృష్టిలోకి వచ్చింది . అతని మనసు బాగా నొచ్చుకుందని , ఇదే విషయం రష్మికను అడిగాడని, ఆమెకు కోపం వచ్చి నిశ్చితార్థం రద్దు చేసుకుందనే వార్త వ్యాపించింది .
నిజానికి కర్ణాటకలో రక్షిత్ కు మంచి పేరుంది . అతను హీరోగా 10 సినిమాల దాకా చేశాడు. రక్షిత్ , రష్మిక కలసి 2016లో కిరిక్ పార్టీ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా ఘనవిజయం సాధించింది . అప్పుడు రశ్మికకు 19 సంవత్సరాలు. పైగా తొలి సినిమా. అప్పుడే రక్షిత్, రష్మిక మధ్య ప్రేమ చిగురించింది. వయసు ముచ్చటో , గ్లామర్ మాయాజాలమో తెలియదు కానీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు . ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు . రష్మికకు ఊహుంచని విధిగా స్టార్ డమ్ రావడంతో రద్దు చేసుకుందని కొందరు అంటుంటే, కాదు విజయ దేవర కొండతో సన్నిహితంగా ఉండటంతో రక్షితే క్యాన్సిల్ చేసాడని మరి కొంత మంది చెప్పుకుంటున్నారు . ఏది నిజమో తెలియదు . కానీ రస్మిక మాత్రం తన ట్విట్టర్ లోనుంచి రక్షిత్ ఫోటో మాత్రం తీసివెయ్యలేదట . అంటే రష్మిక మనసులో రక్షిత్ వున్నట్టే కదా ?