`బాహుబలి` వంటి సంచలన చిత్రం తరువాత దేశ వ్యాప్తంగా క్రేజ్‌ని సొంతం చేసుకున్న చిత్రం `కేజీఎఫ్ చాప్టర్ 1`. కన్నడ చిత్రపరిశ్రమ కీర్తిని, కన్నడ సినిమాని యావత్ భారతం ఒక్కసారి ఆశ్చర్యంతో తిరిగి చూసేలా చేసింది. హీరో రాక్‌స్టార్ యష్‌ని రాత్రికి రాత్రి పాన్ ఇండియా స్టార్‌ని చేసింది. దేశ వ్యాప్తంగా 185. 24 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం ప్రపచ వ్యాప్తంగా 238 కోట్లు సాధించిన తొలి కన్నడ సినిమాగా చరిత్ర సృష్టించింది. తొలి భాగం అనూహ్య విజయాన్ని సాధించడంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ `కేజీఎఫ్ 2`ని మరిన్ని ప్రత్యేకతలతో తెరపైకి తీసుకొస్తున్నాడు.
ఇప్పటికే `కేజీఎఫ్ 2` కోసం బాలీవుడ్ బ్యాడ్ మెన్ సంజయ్‌దత్‌ని అధీరాగా రంగంలోకి దింపిన ప్రశాంత నీల్ మాజీ ప్రధాని ఇందిరా గాంధీని పోలిన పాత్రలో రవీనా టాండన్‌ని సెలెక్ట్ చేసుకున్నారు. ప్రస్తుతం `కేజీఎఫ్ చాప్టర్2` షూటింగ్ ఫుల్ స్వింగ్‌లొ వుంది. బుధవారం హీరో యష్ పుట్టిన రోజు కావడంతో టీజర్‌ని రిలీజ్ చేసే అవకాశాలు వున్నట్టు ప్రచారం జరుగుతోంది. మంగళవారం అర్థ్ర రాత్రి నుంచే యష్ ప్యాన్స్ యష్ బాస్ పేరుతో పుట్టిన రోజు హంగామా మొదలుపెట్టారు. ఇప్పటికే బెంగళూరు నయాద హల్లి ప్రాంతపాల్య నందిలింక్ గ్రౌండ్‌లో 216 అడుగుల యష్ కటౌట్‌ని ఏర్పాటు చేస్తున్నారు.
ఇది వరల్డ్ లోనే అత్యంత లార్జెస్ట్ కటౌట్‌గా రికార్డులకు ఎక్కబోతోంది. ఇదే ఓ రికార్డు కాగా, బర్త్‌డే కోసం 5000 కేజీల కేక్‌ని కూడా సిద్ధం చేసినట్లు అభిమానులు చెబుతున్నారు.