యాక్షన్ తో అదరకొట్టిన తెలుగు ట్రైలర్

యాక్షన్ ప్యాన్స్ కు తెగ నచ్చేస్తుందీ ట్రైలర్

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ హృతిక్‌ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘వార్‌’. ‘బ్యాంగ్‌ బ్యాంగ్‌’ దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమా తెలుగు వెర్షన్ ని సైతం భారీగా విడుదల చేస్తున్నారు . ఈ నేఫద్యంలో తెలుగు ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు. ఎంతో ఆసక్తికరంగా తీర్చిదిద్దిన ఈ ట్రైలర్‌ సినిమాపై భారీ అంచనాలు పెంచుతోంది.

War Trailer | Hrithik Roshan | Tiger Shroff | Vaani Kapoor | Telugu Version | YRF Spy Universe

యాక్షన్‌కు పెట్టింది పేరు హృతిక్‌, టైగర్‌. ఇప్పుడు ఇద్దరూ తెరపై సందడి చేసేందుకు సిద్ధం కావడంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. హృతిక్‌, టైగర్‌ మధ్య వచ్చే భారీ ఫైట్ సీన్స్ , ఉత్కంఠ రేకెత్తించే కార్‌ ఛేజింగులు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతాయని చిత్రయూనిట్ చెబుతోంది. ఈ చిత్రంలో వాణీ కపూర్‌ హీరోయిన్. యశ్‌రాజ్‌ ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం గాంధీ జయంతి సందర్భంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.