మ‌రో మూడు నెల‌లు ఆగాల్సిందేనా?‌

మ‌రో మూడు నెల‌లు ఆగాల్సిందేనా?‌

ఈ నెల 16న వంద మంది అతిర‌థ మ‌హార‌ధుల మ‌ధ్య హీరో నితిన్ వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌గాల్సింది. కానీ క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో త‌ను ప్లాన్ చేసుకున్న డెస్టినేష‌న్ వెడ్డింగ్ ని వాయిదా వేసుకున్నాడు నితిన్‌. నిఖిల్ గౌడ మాత్రం పెళ్లి విష‌యంలో కాంప్ర‌మైజ్ కాలేదు. అనుకున్న ముహూర్తానికే రేవ‌తిని వివాహం చేసుకుని షాకిచ్చాడు.

బెంగ‌ళూరులోని ఫామ్ హౌస్‌లో వీరి వివాహం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఇదిలా వుంటే తెలుగు హీరో నితిన్ మాత్రం త‌న పెళ్లికి తొంద‌ర ప‌డ‌టం లేదు. ఎంత ఆల‌స్య‌మైతే అంత గ్రాండ్‌గా వివాహం చేసుకోవాల‌ని ప్లాన్‌లు వేస్తున్నాడు. ఎవ‌రు ఎంత టెమ్ట్ చేసినా తాను మాత్రం మ‌రో మూడు నాలుగు నెల‌ల త‌రువాతే వివాహం చేసుకోవాల‌ని ఫిక్స‌య్యాడ‌ట‌.

కార‌ణం ఏంటంటే క‌రోనా ప్ర‌భావం మ‌రో నెల‌, లేదా రెండు నెల‌ల్లో క్లియ‌ర్ అవుతుంది. ఆ త‌రువాత మ‌రో రెండు నెల‌ల్లో అంతా క్లియ‌ర్ అయిపోయి సాధార‌ణ వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతుంది. అప్ప‌డు త‌ను ప్లాన్ చేసుకున్న‌ట్టు డెస్టినేష‌న్ వెడ్డింగ్ చేసుకోవాల‌ని భావిస్తున్నాడ‌ట‌. త‌న‌ని ఎవ‌రు అడిగినా మ‌రో మూడు లేదా నాలుగు నెల‌లు ఆగాల్సిందే అని చెబుతున్నాడ‌ని తెలిసింది.