దివంగత సీనియర్ నటి మనోరమ కుమారుడు భూపతి అధిక మోతాదులో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. దీంతో ఆయన్ని వెంటనే చెన్నైలో ని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించడంతో ప్రాణా పాయం నుంచి తప్పించుకున్నాడు. మరి ఘనకార్యం ఎందుకు చేసినట్లు? అంటే మనోరమా పరువు తీసేలా ప్రవర్తించాడని తెలుస్తోంది. లాక్ డౌన్ నేపథ్యంలో దేశంలో అన్ని మూతపడిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా యథావిధిగా మద్యం షాపులు కూడా మూసివేసారు. మందుకు బానిసైన భూపతి గత కొన్ని రోజులుగా షాపుల్ బంద్ ఉండటంతో ఆ బాధతను భరించలేక..మానసిక ఒత్తిడికి గురయ్యాడు.
దీంతో చివరికి మత్తుకోసం అధికంగా నిద్ర మాత్రలు తీసుకున్నాడు. దీంతో అతన్ని స్థితిని గుర్తించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ఓ గొప్ప నటి కుమారుడు ఇలా చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి వాళ్ల వల్ల ఆ కుటుంబానికే కాదు..దేశానికి ఏం ఉపయోగం అంటూ మండి పడుతున్నారు. కొంచమైనా బాధ్యత లేకుండా వ్యవరించే వారిపై ప్రభుత్వం కఠినంగానే వ్యవరించాలని సూచించారు. అలాగే మద్యం దొరక్కపోవడంతో ఇప్పటికే దేశంలో వేర్వేరు చోట్ల కొంత మంది ఆత్యహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇలాంటి వాళ్ల కోసమైనా మద్యం తెరవాలని నటుడు రిషీ కపూర్ గతవారం ఓ ట్వీట్ చేసి విమర్శలు కూడా ఎదుర్కున్నారు. దీంతో రిషీ కపూర్ పై మద్యం షాపులు మీకోసం తెరవాలా? లేక నిజంగా వాళ్ల కోసం తెరవాలా? అని నేటి జనులచే అక్షింతలు వేయించుకున్నారు. మీ ఇంట్లో స్టాక్ ఉంచుకున్న మద్యం అయిపోయిందనా? ఈ ట్వీట్ అంటూ రిషీ కపూర్ పై దాడి చేసారు.