ఏ భాషలో ఏ దర్శకుడు భారీ సినిమా తీయాలని ప్లాన్ చేసినా దర్శకధీరుడు రాజమౌళిని ఫాలో కావాల్సిందే. `బాహుబలి`తో జక్కన్న ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో సరికొత్త ట్రెండ్‌ని సృష్టించాడు. భారతీయ తెరపై అదీనూ దక్షిణాది సినిమాల్లో ఓ భారీ చిత్రాన్ని వందల కోట్ల బడ్జెట్‌తో తెరపైకి తీసుకురావాలంటే నిర్మాతలు ఆలోచిస్తున్న తరుణంలో `బాహుబలి` చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందించి కొత్త ట్రెండ్‌కు తెరలేపారు.
దీంతో హాలీవుడ్ రేంజ్‌లో భారీ చిత్రాలు నిర్మించాలని ఇంత కాలం ఎదురుచూసిన నిర్మాతలకు `బాహుబలి` సరికొత్త ఉత్సాహాన్ని అందించింది. ఇదే స్ఫూర్తితో కన్నడలో `కేజీఎఫ్ చాప్టర్ 1` ప్రేక్షకుల ముందుకొచ్చింది. త్వరలో రెండవ బాగం రాబోతోంది. ఇదిలా ఉంటే హిందీలోనూ ఇదే ఫార్ములాతో `బ్రహ్మాస్త్ర` రెండు భాగాలుగా రూపొందుతోంది. ఇదే బాటలో మణిరత్నం కూడా జక్కన్నను ఫాలో అవుతున్నాడు.
మణిరత్నం రూపొందిస్తున్న డ్రీమ్ ప్రాజెక్ట్ `పొన్నియిన్ సెల్వన్`. తమిళ ఇండస్ట్రీలో వున్న క్రేజీ హీరోలు, నటీనటులంతా కలిసి నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ఇది. దీన్ని తెరపైకి తీసుకురావాలని గత కొన్నేళ్లుగా మణిరత్నం ప్రయత్నం చేస్తూనే వున్నారు. ఆ ప్రయత్నం రాజమౌళి కారణంగానే ఇటీవల కార్యరూపం దాల్చింది. `పొన్నియిన్ సెల్వన్` చిత్రాన్ని తాను రెండు భాగాలుగా రూపొందిస్తున్నానని, అయితే ఈ టైమ్‌లో పెన్ను ముందుకు కదలడం లేదని మణిరత్నం వెల్లడించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.